హైదరాబాద్: హైదరాబాద్‌పైనా వరుణుడి పగ చల్లారలేదు. గురువారం మధ్యాహ్నం గంట వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షం కురవగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే అపార్టుమెంట్లలో చేరిన నీటిని బయటకు పంపే మార్గాలు కరవైన ప్రజలు తాజా వర్షంతో మరింత ఆందోళనకు గురయ్యారు. మరోవైపు రాత్రి 9 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. 12 గంటల సమయంలోనూ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. మరో రెండు రోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

అల్పపీడనం ప్రభావంతో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త తేరుకున్న నగరాన్ని భారీ వర్షం మళ్లీ ముంచెత్తింది. మంగళవారం నాడు కురిసిన భారీ వర్షం నుంచి నగర ప్రజలు తేరుకోకముందే గురువారం మధ్యాహ్నం మరో మారు భారీ వర్షం నగర జీవిని అతలాకుతలం చేసింది. నగరంలో మరో మారు కురిసిన భారీ వర్షంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ నుంచి సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సత్వరమే సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, జీడిమెట్ల, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, హబ్సిగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగానే భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన వర్షం అరగంటలోనే నగరవ్యాప్తంగా 2సెం.మీలు కురిసింది. వెస్ట్‌మారేడ్‌పల్లి, చిలకలగూడలో 3 సెం.మీ, మాదన్నపేట, నారాయణగూడ, ఫీవర్ ఆస్పత్రి, తిరుమలగిరి, శ్రీనగర్ కాలనీల్లో 2సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు వరదనీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షం మొదలుకావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్ఎంసీ అధికారులు సహాయచర్యలు చేపడుతున్నప్పటికీ బాధితులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు.

మాదాపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే మార్గం లో రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తోంది. ఉదయం నుంచి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 1, 2, 3, 10, 12లో వాహనాలు నెమ్మదిగా కదులుతు న్నాయి. కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా మళ్లిస్తున్నారు. శాంతి భద్రతల పోలీసులు కూడా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రంగంలోకి దిగారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి, తారానగర్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడ, గౌలిదొడ్డి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యిది. చందానగర్ వద్ద జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. మాదాపూర్, శిల్పారామం, గౌలిదొడ్డి తదితర ప్రాంతాల్లో రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంటూరు: వరుణాగ్రహానికి ముఖ్యంగా ఏపీలోని గుంటూరు జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగు వంకలు నదులను తలపిస్తూ, గ్రామాలపైకి, రహదార్లపైకి విరుచుకుపడ్డాయి. పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. రహదార్లపై నాలుగు అడుగుల మేరకు నీరు ప్రవహించింది. నడికుడి, గుంటూరు మార్గంలో రైలు పట్టాలు కోతకు గురికాగా, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఎక్కడివక్కడే నిలిచాయి.

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో రాష్ట్రం లో వర్ష బీభత్సం కొనసాగుతోంది, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 120 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి, 120 కాలనీలు నీట మునిగాయి. ఇందులో 20 కాలనీల పరిస్థితి సీరియస్ గా ఉంది. నిజాంపేట, షాపూర్, కూకట్ పల్లిలో అత్యధికస్థాయిలో వర్షం పడింది. హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం 513 అడుగులు దాటింది. మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

Heavy-Rains
Heavy-Rains

టీసర్కార్ జీహెచ్ ఎంసీ పరిధిలో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఆర్మీ, ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆర్మీ రంగంలోకి దిగనుంది. హైదరాబాద్ లో 25 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లడం లేదు. బాధితులు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాగులు, వంగలు పొంగిపొర్లుతున్నాయి, పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జనజీవన స్తంభించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలువలు,చెరువులకు గండ్లు పడ్డాయి, వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 9700 క్యూసెక్కులుగా ఉంది. అటు సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 521.2 మీటర్లు, పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు. ప్రస్తుత నీటి నిలువ 18.9 టీఎంసీలు. పూర్థిస్థాయి నీటిమట్టం 30 టీఎంసీలు. ఇన్‌ఫ్లో ఫ్లో 4,187 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 117 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కేతేపల్లి మండలం కొత్తపేట అలుగు వద్ద మూసీ కుడి కాలువకు గండిపడింది. అదేవిధంగా మండలంలోని భీమారం వద్ద మూసీ ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతి లోతట్టు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల క్యూ సెక్యుల వరదనీరు వచ్చి చేరడంతో 30 టీఎంసీలను నిల్వ చేశారు. 15 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Heavy-Rains
Heavy-Rains

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అశ్వారావుపేటలో చెరువులు నిండి అలుగులు పోస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసింహసాగర్‌, చెన్నయ్యకట్టు చెరువు, పాలవాగు చెరువు, అనంతారం వూరచెరువు, మొద్దులమడ, గెంటేడివాగు నిండుకుండలా మారి వరదనీరు అలుగుల ద్వారా దిగువకు పారుతోంది. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గోపన్నగూడెం-కంట్లం, నెమిలిపేట-వాగోడ్డుగూడెం, గుమ్మడవల్లి-రంగాపురం మధ్య వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి.

మహబూబ్‌ నగర్‌ ,మెదక్ , వరంగల్‌, హన్మకొండలను వానలు అతలాకుతలం చేశాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలాలన్నీ పొంగిపొర్లాయి. హంటర్‌ రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

 

 

హైద్రాబాద్: నగరంలోని నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించామని మంత్రి తెలిపారు. అలాగే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, హుస్సేన్‌సాగర్‌ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నగరంలో రోడ్లు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. 80శాతం చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడమేగాక నాలాల ఆక్రమణలపై విచారణకు కమిటీ వేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

బేగంపేట: వరుసగా కురుస్తున్న వర్షాలతో మంత్రులు రోడ్డెక్కారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినడమే కాకుండా చాలా ప్రాంతాలు నీట మునగడంతో పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉండడంతో ఓపీ వేళలను పెంచుతున్న వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.

నల్గొండ కాంగ్రెస్ నేతలు అసమర్ధులు: కేటీఆర్

కాంగ్రెస్ బావ దారిద్రపు పార్టీ అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నల్గొండ కాంగ్రెస్ నేతలకన్నా అసమర్ధులు ఎక్కడ ఉండ...

2019 నుంచి పవన్ కళ్యాణ్ సీఎం

ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరోజు నిరశన దీక్షకు దిగారు. శనివారం ఉదయం 9గంటలకు

నిండు ప్రాణం నీటి పాలు

ఇసుక పడవ చేపల వేటకు వెళ్లిన పడవను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ

ఇంటర్ విద్యానంతరం ఇంజినీరింగ్ ఉన్నత చదువులకు గాను జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణలో అధికారులు మే25న ప్రార...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

నిఫా వైరస్ భారత్ లో కొత్తకాదు

నిఫా వైరస్ మనదేశంలో ఇది వెలుగు లోకి రావడం కొత్తకాదు. కానీ వేగంగా, సమర్ధంగా చర్యలు తీసుకోకపోతే ఈ అంటువ్యాధి కోర...

జమ్మూ కాశ్మీర్ లో సైన్యం కాల్పులు

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మం...

పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లనేఅనుమానంతో అమాయకులపై దాడులు

గత వారం 10రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లతో పాటు నరహంతక ముఠాలు తిరిగుతున్నాయ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...