విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సీఎం జగన్ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తుగ్లక్ పాలన అంటే ఏంటో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నానని ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నానని మండిపడ్డారు. ప్రభుత్వ విధానం దారుణంగా ఉందని పద్దతి మార్చుకోకపోతే పోరాటానికి దిగుతామని లోకేష్ హెచ్చరించారు. ఇంత ఆందోళనలు చేస్తోన్న ప్రభుత్వం ఇసుక పంపిణీ ప్రారంభించడంలేదని ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఎన్ని రోజులు పనులు లేకుండా పస్తులుండాలని లోకేష్ ప్రశ్నించారు.