chandrababu fire on ec

ఈవీఎంలపై తమకు ముందునుంచి అనుమానం ఉందని చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించేందుకు ఈసీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఈవీఎంలపై పోరాడే విషయంలో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్లాన్ ను అమలు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం ఈసీ తీరుపై నిప్పులు చెరిగారు. వీవీప్యాట్లను లెక్కించేందుకు 6 రోజుల సమయం పడుతోందని ఈసీ కోర్టుకు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని మండిపడ్డారు. టీడీపీ పోరాటఫలితంగానే వీవీ ప్యాట్లు అమల్లోకి వచ్చాయని, అలాంటపుడు పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈసికి ఉన్న అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇది ఒకరకంగా ఫలితాలను తారుమారు చేసే కుట్రలో ఓ భాగమై ఉండవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గెలుపు విషయంలో తనకేమీ భయం లేదన్నారు. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారెందరో ఉన్నారని, వారి ఓట్లు దుర్వినియోగం కాకూడదనే ఈ తపన అని చెప్పారు. టీడీపీ గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. 

మేం పోరాడేది, ఈవీఎంలు, ఈసీల పనితీరుపై అయితే..ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేస్తున్నామని కొంతమంది అసత్య ప్రచారాలకు తెరలేపారని విమర్శించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు తేడా ఉన్నందు వల్లే ముందుగా 50 శాతం ఓట్లను లెక్కించాలని పట్టుబడుతున్నామని తెలిపారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తామన్నారు. ఫారం -7లో తప్పుడు ఫిర్యాదులొస్తే ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణంలోనే కోర్టుకు తప్పుడు అఫిడవిట్ అందించిన వారు ఏం చేయడానికైనా బరితెగిస్తారని పరోక్షంగా మోడీకి చురకలు అంటించారు చంద్రబాబు. సర్జికల్ స్ర్టైక్స్ అంటూ అభూతకల్పనలు సృష్టించడమే కాకుండా ఆ స్ర్కైక్స్ పై ఎవరైనా విమర్శలు చేస్తే..తప్పు చేసినట్లే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇండియాకు బెస్ట్ సీఎం మోడీయేనని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పొంగిపోయారు..మరి ఇప్పుడు కుమ్మక్కైంది ఎవరని ప్రశ్నించారు. 

ఇతర రాష్ర్టాల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బు పంచేందుకు మోడీ తన హెలికాఫ్టర్ లోనే నగదును తరలిస్తున్నారన్నారు. మరి ఎన్నికల కోడ్ ప్రధానికి వర్తించదా ? అని అడిగారు. కేవలం ఈవీఎంలు, వీవీ ప్యాట్లకోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారు. అంత స్థాయిలో ప్రజాధనం ఖర్చు పెట్టి ఇప్పుడు వీవీ ప్యాట్లను లెక్కించమంటే ఎందుకు కుదరంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎందుకింత మోసం చేస్తున్నారని నిలదీశారు. అవసరమైతే ఈసీ, ఈవీఎంల గురించి దేశం మొత్తం తిరిగి మళ్లీ కోర్టుకెళ్తానన్నారు.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదన్నారు టీడీపీ నేత రాజేంద్రప్రస...

కేర్ టేకర్ గా సీఎం సమీక్షలు..

రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఏనాడైనా చెప్పారా ? అని ప్రశ్నించారు హోంమంత్రి చినరాజప్ప. సీఎం సమీక్షలు...

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవ...

తిరుపతిలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 69వ జన్మదిన వేడుకలను తిరుపతిలో జరుపుకోనున్నారు. శనివారం సీఎం కుటుంబ సమేతంగా

అవినీతి చేస్తోంది... రెవెన్యూ అధికారులా? టీఆర్ఎస్ నాయకులా?

నల్గొండ: తెలంగాణాలో అవినీతికి పాల్పడుతోంది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు బీజేపీ నేత...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నగారా...

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈరోజు నోటిఫిక...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూమి కంపించింది. రెండు గంటల వ్యవధిలో

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అకాల వర్షాలతో...అపార నష్టం

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టా...

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకంటే హాట్ టాపిక్ ఇదే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు ఎన్నికలకంటే హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఐటీ దాడులు ఇప్పుడు ఆ రాష్ట్రాన్...

తివారి కుమారుడిది హత్య ?

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ ఈ నెల 16వ తేదీ సాయంత్రం అనారోగ్యానిక...

ఐదుగురిని హతమార్చిన ఏనుగు

ఒడిశా : ఓ ఏనుగు ఐదుగురిని హతమార్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ...

బంతి బౌండరీలు దాటింది

బంతి బౌండరీలు దాటింది

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, సక్సెస్ టాక్ సంపాదించుకుంది. తొలిర...

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ మూడో పాట వీడియో ప్రివ్యూ విడుదల హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు...

ఢిల్లీతో మ్యాచ్ హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..?

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌త...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...