Print
Hits: 174

హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు దరఖాస్తు సమర్పించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల

నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ గాంధీభవన్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలి రోజు 30కిపైగా దరఖాస్తులు నమోదయ్యాయి. ఖమ్మం నుంచి వి.హెచ్, నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, అలాగే నల్గొండ నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, వరంగల్‌ నుంచి ఇందిరా, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్‌, బలరాంనాయక్‌లు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మరో రెండు రోజుల పాటు జరగనుంది.

e-max.it: your social media marketing partner