- మూగబోనున్న మైకులు..రంగంలోకి నాయకులు

తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. మైకులన్నీ మూగబోనున్నాయి. సభా ప్రాంగణాలు

lశ్రాంతి తీసుకోనున్నాయి. ఇన్ని రోజులు ప్రధాన పార్టీలు సహా, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఆయా నియోజకవర్గాల్లో తారా స్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. పోటాపోటీగా చేస్తున్న ప్రచారాలను పరిగణలోకి తీసుకుంటే ఎవరు అధికారం చేపడుతారో ప్రజలకే అర్థం కావడం లేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో నాయకులకు కూడా ఎవరు మెజార్టీ ఓట్లతో గెలుస్తారో తెలియని పరిస్థితి. టీఆర్ఎస్ తరపున, కూటమి తరపున, బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆయా పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు తెలంగాణకు కదిలొచ్చారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, టీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు, కూటమి పార్టీల్లోని టీడీపీ, కాంగ్రెస్ నుంచి చంద్రబాబు, రాహుల్ గాంధీ, కుంతియా, తదితర నాయకులు రోడ్ షో లు, బహిరంగ సభలు, ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి తమ ప్రసంగాలతో దాదాపుగా ఓటర్లను ఆకట్టుకున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కేసీఆర్, చంద్రబాబు ఆఖరి ప్రసంగాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చివరి ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. అలాగే కోదాడలో రాహుల్, చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ - మహాకూటమి ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. రెండింటిలో ఏ పార్టీ పగ్గాలు చేపడుతుందో పోలింగ్ పూర్తయి 11న కౌంటింగ్ ఫలితాలు వెలువడేంత వరకూ వేచి చూడాల్సిందే.

 

ఇదిలా ఉంటే రాష్ర్టవ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల వద్ద ఎన్నికల అధికారులు, పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేని కోట్ల నగదు లభ్యమవుతుంది. నిన్న జనగామ జిల్లా పెంబర్తి వద్ద స్విఫ్ట్ కారులో రూ.5.80 కోట్లు, ఆదిలాబాద్ లో రూ.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంబర్తి వద్ద స్వాధీనం చేసుకున్న నగదు ముగ్గురు టీడీపీ నాయకులకు చెందినదిగా సమాచారం. అలాగే నేడు హైదరాబాద్ జిల్లాలోని జూబ్లిహిల్స్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో రూ.2.14 కోట్ల నగదు లభ్యమైంది. దానిని టాస్క్ ఫోర్స్ సీజ్ చేశారు. 

e-max.it: your social media marketing partner

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

100 కాదు 10 స్టులు కూడా రావు పో...

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీని అర్ధాంతరంగా...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

రేపే కౌంటింగ్..ఏర్పాట్లు పూర్తి

ఈ నెల డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆసిస్ గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయం

ఆస్ర్టేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కంగారూలపై భారత్ దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...