chandrababu national politics

చంద్రబాబు వ్యహ చతురత ఈ కాలంలోనే ప్రజలకు బాగా తెలిసింది. అది 2004 నుంచి 2014 ఎన్నికల వరకు చంద్రబాబు ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఐదేళ్లపాటు సీఎం హోదాలో ఉంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ఎదురైన రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం ఓ ఎత్తైతే, 2009 ఎన్నికల నాటికి పార్టీలో అసమ్మతి సెగ, చిరంజీవి పీఆర్పీని ప్రారంభించడం..ఇలా చంద్రబాబును వరుసగా సమస్యలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకుని నిలబడాలనుకుంటున్న తరుణంలో పార్టీలోని నేతల ఒత్తడితో 2009 టీఆరెస్ తో పొత్తు పెట్టుకోవడం, దాని ప్రభావంతో  తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూడటంతో టీడీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్న వాదన వినిపించింది. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడంతో పార్టీని ముందుకు తీసుకెళ్లడం చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర విభజన డిమాండ్ ఉధృతమవడంతో విభజనకు అనుకూలంగా టీడీపీ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ సమస్యలను అధిగమిస్తూనే ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న అభిమానం తగ్గకుండా ఉండేందుకు చంద్రబాబు 62 ఏళ్ల వయస్సులో దాదాపు మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక రాష్ట విభజన తర్వాత జరిగిన పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు.       

 

రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలనే విషయం కూడా చంద్రబాబుకు బాగా తెలుసు. తనకు ఎంత అనుభవం ఉన్నా, పరిస్ధితులు, అవసరాలకు అనుగుణంగా ఎదుటి వారిని కలుపుకుని వెళ్లేందుకు చంద్రబాబు ఏమాత్రం భేషజాలకు పోరు. అందుకే 2014 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్లి, ఆయనతో పొత్తు కుర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లి తన స్ధాయిని దిగజార్చుకున్నారని పలువురు టీడీపీ సానుభూతిపరులు అప్పట్లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయావకాశాలు ఏరకంగా మెరుగుపడ్డాయో అందరికీ అర్ధమైంది. చంద్రబాబు ఓ మెట్టు దిగి, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం వల్లే ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఓ ఎత్తైతే, బీజేపీతో విభేదాలను పక్కనపెట్టి కమలనాధులతో జట్టుకట్టేందుకు చంద్రబాబు సిద్ధపడటం మరో కీలక మలుపు. జాతీయ స్ధాయిలో మోడీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని గ్రహించిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పేందుకు బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఇలా చివరి క్షణంలో చంద్రబాబు చక్రం తిప్పడంతో ఏపీ జనం టీడీపీకి నీరాజనం పట్టారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారంటే, కేవలం ఆయన వ్యూహం ఫలించడమే కాదు,  హైదరాబాద్ తరహాలో ఏపీ రాజధానిని  కూడా అభివృద్ధి చేస్తారని ఏపీ ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఓట్లు వేసి తమ మద్దతును తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకూడదన్న ఉద్దేశం చంద్రబాబు శక్తి వంచన లేకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి, ఏపీని ఏదో రకంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఓటుకు నోటు కేసు చంద్రబాబుకు అశనిపాతంగా మారింది. కానీ ఆ దెబ్బ నుంచి వేగంగా కోలుకుని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎంతో ఉన్న విభేదాలకు చంద్రబాబు స్వస్తి పలికారు. కేసీఆర్ కు సన్నిహితంగా మెలుగుతూ నాలుగున్నరేళ్లు చంద్రబాబు హుందాగా ప్రవర్తించారు. పొరుగు రాష్ట్రంతో తలెత్తిన సమస్యలను కొలిక్కి తేవడంతో పాటూ విభజన హామీలను సాధించేందుకు చంద్రబాబు లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోమని ప్రధానితో పాటూ కేంద్రం మంత్రుల వద్ద ప్రాధేయపడ్డారు. కానీ చంద్రబాబు మిత్రధర్మంతో ఇచ్చిన చనువుని ఆసరాగా తీసుకుని మోదీ సర్కారు ప్రత్యేక హోదాను అటకెక్కించి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. ఏ పేరైనా ఫర్వాలేదు, తమ రాష్ట్రానికి విభజన హామీల అమలుకు నిధులు వస్తే చాలని చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. కానీ ఈ విషయంలోనూ కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడకపోవడంతో చంద్రబాబు తన రెండో ఫేస్ ను కమలనాధులకు చూపాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమి నుంచి బయటపడటమే కాదు. పార్లమెంటు వేదికగా మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ఏపీ ప్రజలకు కేంద్రం నమ్మక ద్రోహం చేసిందనే విషయాన్ని యావత్తు దేశానికి చాటి చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.      

 మోదీ సర్కారుపై ధిక్కార స్వరం వినిపించిన రోజు నుంచి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి టార్గెట్ అయ్యారు. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని బెదిరించాలనుకోవడంతో పాటూ ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఈడీలను బూచిగా చూపి, తమిళనాడులో అన్నాడీఎంకేను లొంగదీసుకున్న విధంగా చంద్రబాబును కూడా దారిలోకి తెచ్చేందుకు కమలనాధులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, వాళ్లు పప్పులు ఉడకడం లేదు. తనను కట్టడి చేసేందుకు బీజేపీ హైకమాండ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వాటిని ఓ వైపు హ్యాండిల్ చేస్తూనే మరోవైపు జాతీయ రాజకీయాల్లో మోదీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు. కర్ణాటక ఎన్నికల ద్వారా ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టుడం, ఆ ప్రయత్నం ఫలించడంతో చంద్రబాబు ఇమేజ్ జాతీయ స్ధాయిలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరైన సందర్భంలో ఆయనకు జాతీయ పార్టీ నేతల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదే వేదికపై కాంగ్రెస్ చీఫ్ రాహూల్ తో చంద్రబాబు కరచాలనం చేయడం కొసమెరుపు. ఇలా మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ ప్రజల నాడికి తగ్గట్టు పావులు కదపే చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు. 

 

కాంగ్రెస్ టీడీపీల మధ్య మైత్రి కుదరడానికి తెలంగాణ ఎన్నికల్లో బీజం పడంది. రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువుగా ఉన్న టీఆరెస్ ను మట్టికరిపించేందుకు కాంగ్రెస్, టీడీపీలు జట్టుకట్టేందుకు సై అంటున్నాయి. నిన్నటి వరకు తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనుకున్న వారంతా గత నెల రోజుల పరిణామాలను చూశాక, మళ్లీ తెలుగుదేశం కీలక పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో చచ్చిపోయిందనుకున్న కాంగ్రెస్ కు అన్నీ విధాల ఆక్సిజన్ ఇస్తున్నందువల్లే చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎంత సైలెంట్ గా ఉంటే ఆయన నిర్ణయాలు ఎంత వైలెంట్ గా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లతో కుదిరిన ఈ మైత్రి కేవలం తెలంగాణ ఎన్నికలకే పరిమితం కాకుండా జాతీయ స్ధాయిలో మోదీని గద్దె దించే వ్యూహంతో ముందుకు సాగాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకే మూడున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. కాంగ్రెస్ ను కనుమరుగు చేసే లక్ష్యంతో పుట్టిన టీడీపీ తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందిన్న ప్రత్యర్ధుల విమర్శలను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు తెగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు జాతీయ రాజకీయం చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ మరో హైలైట్ అంశం ఏమిటంటే, కాంగ్రెస్ తో విభేదించి ఒంటరి పోటీకి సిద్ధపడిన మాయావతిని సైతం మళ్లీ దారిలోకి తెచ్చేందుకు బాబు చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో బీజేపీయేతర పక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చే బాధ్యతను రాహూల్ గాంధీ చంద్రబాబుకు అప్పగించారన్న వాదన వినిపిస్తోంది.

చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబుతో కలిసి ఓ కూటమి తరపున పనిచేసే అవకాశం రావడంపై వివిధ పార్టీలకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఈ అభినందనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు చేసే వారు ఓ విషయాన్ని గుర్తించాలి. ఎవ్రి థింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అనే ఆంగ్ల సామెతకు తగ్గట్టు సందర్భానికి అనుగుణంగా చంద్రబాబు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ వ్యూహాలు కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కొన్నిసార్లు బెడిసి కొట్టొచ్చు. ఆ లాజిక్ మరచిపోయి, చంద్రబాబు ఏం చేయాలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ఆయన ప్రత్యర్ధులు ఎలా నిర్దేశిస్తారు? రాజకీయాల్లో ఉన్న గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలన్నిటినీ బాగా వంటబట్టించుకోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డును చంద్రబాబు సొంత చేసుకోగలిగారు. వైస్ రాజశేఖరరెడ్డితో పాటూ ఆయన తనయుడితో కూడా సై అంటే సై అని తొడకొట్టగలుగుతున్నారు. నిత్యం చంద్రబాబును విమర్శించడానికి బదులు ఆయనలోని ప్లస్ పాయింట్లను కొన్నింటిని ఫాలో అయినా ఈపాటికి జగన్ మంచి ప్రతిపక్షనేతగానైనా గుర్తింపు పొందేవారని తెలుగుతమ్ముళ్లు సెటైర్లు వేస్తుంటారు. మొత్తంమీద తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు వేస్తున్న అడుగులు వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

e-max.it: your social media marketing partner

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లోనే

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

ఆ ఇద్దరికీ రక్షణ కల్పించండి

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. అలా కోర్ట...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

విషాదం..పేలిన సిలిండర్

అనంతపురం జిల్లా కొత్తచెరువులో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో

అయేషా హత్యకేసు : సత్యంబాబు చెప్పిన సమాధానాలు

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...