జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు ఇద్దరు కలిసి స్వామివారిని
దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో వారిని సత్కరించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాందెడ్ల మనోహర్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. రానున్న ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.