seates to bjp votes to congress, karnataka elections

ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. ఎంత ఆధిక్యం అన్నది అప్రస్తుతం. ఓటర్లను ఎంతగా ఆకట్టుకున్నామన్నదే ప్రాధాన్యం. ఎలా అన్నది అనవసరం. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అక్షరాలా దీన్నే చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెచ్చుకుంటే విపక్ష భారీతీయ జనతా పార్టీ సీట్లు తెచ్చుకుంది. అదెలా అంటారా? ఓసారి ఫలితాల సరళి పరిశీలిస్తే... 

కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచారు. అసెంబ్లీలో మెజార్టీ మాత్రం బీజేపీకి కట్టబెట్టారు. మొత్తం పోలయిన ఓట్లలో కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే... కోటీ 36 లక్షల 93 వేల 220 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అదే తరుణంలో బీజేపీకి 36.2 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ కన్నా 1.8 శాతం ఓట్లు తక్కువ అన్నమాట. ఓట్ల సంఖ్యను లెక్కిస్తే కోటీ 30 లక్షల 52 వేల 584 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కన్నా 6 లక్షల 40 వేల 636 ఓట్లు తక్కువగా వచ్చాయన్నమాట. ఈ లెక్కన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే, సీట్లు బీజేపీ దక్కాయన్నమాట. 

జేపీ తక్కువ ఓట్లు సాధించినా... మెజార్టీ విషయంలో స్వల్పమే అయినా ఎక్కువ చోట్ల విజయం సాధించింది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ఎక్కువ మెజార్టీతో తక్కువ స్థానాలను చేజిక్కించుకుంది. ఓట్ల శాతం, మెజార్టీ ఎంత అన్నది కాకుండా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నదే గెలుపునకు సూచిక. దాని ప్రకారమే అధికారం కాంగ్రెస్ నుంచి దూరమైపోయింది. ఇక మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ 18.4 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. అంకెల్లో పరిశీలిస్తే 66 లక్షల 40 వేల 258 ఓట్లు వచ్చాయి. 

కర్ణాటక ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను అదృష్టం తలుపు తట్టింది. అత్యల్ప మెజార్టీతో విజయం వారిని వరించింది. అదెలా అంటే... అలంద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుభాష్ కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ పై కేవలం 697 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. దేవర్ హిప్పర్గిలో అయితే మరీ విచిత్రం. అక్కడ గెలుపును కేవలం 45 ఓట్లు నిర్ధారించాయి. బీజేపీ అభ్యర్థి సోమనగౌడ సమీప జేడీఎస్ అభ్యర్థి భీమనగౌడపై 90 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. హీరేకెరూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ పాటిల్ సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన ఉజ్జనేశ్వరపై 555 ఓట్లతో గెలుపొందారు. ఇక కుందగోల్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై 634 ఓట్ల ఆధిక్యంతో సీటు కైవసం చేసుకుంది. మాస్కిలో కూడా అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాపగౌడ పాటిల్ వైపే నిలిచింది. ఆయన బీజేపీ అభ్యర్థి బసవనగౌడపై కేవలం 213 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు. పావగడలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వెంకటరమణప్ప జేడీఎస్ నుంచి బరిలోకి దిగిన తిమ్మరాయప్పపై 409 ఓట్లు ఎక్కువగా తెచ్చుకుని అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు. అందుకే వీరంతా అదృష్టవంతులు. 

e-max.it: your social media marketing partner

వామపక్షాలు, జనసేన విజయోత్సవ యాత్ర

విశాఖపట్నం: త‌మ‌ పోరాటాల ఫలితంగా, పవన్ కల్యాణ్ గళం విప్పి సంఘీభావం తెలిపి కేంద్రానికి గట్టి సందేశం పంపిన కారణం...

కేంద్రంపై మరోసారి అవిశ్వాసం

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరో...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు

వరంగల్ మహా నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

విశాఖలో దోపిడీ దొంగల హల్ చల్

విశాఖపట్నం: యలమంచిలిలో రామనగర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక ఇంట్లోని వృద్ధులను తాళ్లతో బంధించి 15త...

శ్రీ చైతన్య చైర్మన్ ను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్

మాదాపూర్: శ్రీ చైతన్య కళాశాల ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల చైర్మన్ ను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థుల...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...