పశు దాణా కుంభకోణం కేసులోని దోషులకు శనివారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు మరో 15 మంది దోషులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు.  ఈ కేసులో లాలూ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శనివారం సాయంత్రం తీర్పు వెలువరించారు.   తొలుత రెండు గంటలకు శిక్షలు ఖరారు చేయాల్సి ఉండగా.. నాలుగు గంటలకు వెల్లడిస్తామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి దోషులకు ఓపెన్‌ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లు ఇంతకముందే.. ఆవుల పెంపకం చేసిన అనుభవం ఉంది’ అని వ్యాఖ్యానించారు. గత మూడు రోజుల నుంచి శిక్షల ఖరారుకు సంబంధించిన తీర్పు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

పాతికేళ్ల క్రితం చేసిన పాపం పండింది. నోరులేని పసువుల గడ్డిని మేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కు గడ్డుకాలం మొదలైంది. తప్పుచేసి, తప్పించుకునే ప్రయత్నం చేసిన లాలూ...చివరకు ఆధారాలతో అడ్డంగా బుక్కై పోవడంతో మూడున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ, సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం సంచలన తీర్పునిచ్చింది. శిక్షను తగ్గించమని లాలూ పెట్టుకున్న మొరను కూడా సీబీఐ న్యామూర్తి పట్టించుకోలేదు. జైల్లో చలిని తట్టుకోలేకపోతున్నానంటూ  లాలూ చెప్పిన కుంటి సాకులు న్యాయమూర్తులకు అసహనం కలిగించాయి. అంత చలిగా ఉంటే జైల్లో తబలా వాయించుకోమని న్యాయమూర్తులు మండిపడ్డారు. ఇలా శిక్షను తగ్గించుకునేందుకు లాలూ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో చివరకు ఆయన జైలు శిక్ష ఖరారు చేశారు. దాణా స్కాంలో దారుణానికి పాల్పడిన లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటూ ఐదు లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఆరునెలు అదనంగా శిక్షననుభవించాలని నాయమూర్తి ఆదేశించారు. దీంతో లాలూ రాజకీయ భవితవ్యం అంధకారంగా మారింది.  

శిక్షల ఖరారుకు సంబంధించిన తీర్పు వెలువడనుండటంతో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. బిహార్‌లో 21ఏళ్ల క్రితం పశు దాణా కుంభకోణం కేసులో లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు మరో 15 మందిని దోషులుగా తేలుస్తూ గత నెల 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జనవరి 3న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఓ న్యాయవాది మృతితో తీర్పును వాయిదా వేశారు. అనంతరం మరో రెండు సార్లు తీర్పు వాయిదా పడింది. తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శిక్ష ఖరారు చేయాల్సిందిగా లాలూప్రసాద్‌ యాదవ్‌ న్యాయస్థానం శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఇంతకీ ఈ దాణా కుంభకోణం ఎప్పుడు ఎలా జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే...బీహార్‌లో 1996లో చిన్నపాటి అవకతవకలుగా వెలుగుచూసిన పశుగ్రాస కుంభకోణం ఇంతింతై వటుడింతై అన్నట్లు రూ.940 కోట్లకు చేరింది. 1996 కన్నా ముందు బిహార్‌ వెటర్నరీ అసోసియేషన్‌ 1985లోనే దాణా స్కాంను బట్టబయలు చేసింది. ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. తిరిగి 1996 జనవరిలో దాణా స్కాంను చాయ్‌బాసా డిప్యూటీ కమిషనర్‌ అమిత్‌ ఖేర్‌ వెలుగులోకి తెచ్చారు. అసలు పశువులు లేకుండానే పెద్ద ఎత్తున గడ్డి, మందులను కొనుగోలు చేసినట్లు దొంగ లెక్కలు చూపి, కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టించారనే విషయం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్లుగా ఈ దోపిడీ కొనసాగుతోందని విచారణలో తేలింది. ఈ అవినీతి ఉదంతంపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో బిహార్‌ నుంచి జార్ఞండ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరోపణలకు సంబంధించి దాఖలైన 61 కేసుల్లో 39 కేసులను జార్ఖండ్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో సుమారు 20 లారీల నిండా పత్రాలను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 1997 జూన్‌లో అప్పటి సీఎం లాలూ ప్రసాద్ తోపాటు పలువురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీంతో జూలైలో లాలూ సీఎం పదవి నుంచి వైదొలిగాల్సి వచ్చింది. తన భార్య రబ్రీ దేవిని సీఎం కుర్చీపై కుర్చో పెట్టి, లాలూ కథ నడిపించారు. 2002 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టులో దాణాస్కాం విచారణ ప్రారంభమైంది. దాణా స్కాంలో లాలూపై ఉన్న అభియోగాలను 2014లో జార్ఖండ్‌ హైకోర్టు కొట్టి వేసింది. దీనిపై ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. లాలూ పై ఉన్న కేసుకు సంబంధించిన విచారణను కొనసాగించాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చివరకు లాలూ దోషిగా తేలడంతో ఆయనకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది.

బిహార్‌లో 21ఏళ్ల క్రితం పశు దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 1991-94 మధ్య దేవ్‌గఢ్‌ ఖజానా నుంచి రూ.89.27లక్షల మొత్తాన్ని తప్పుడు వివరాలతో కాజేయడానికి సంబంధించిన కేసులో సీబీఐ విచారణ జరిపి 38 మందిపై అభియోగపత్రాలు నమోదు చేసింది. వీరిలో 11 మంది ఇప్పటికే చనిపోయారు. ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో శిక్షలు పడ్డాయి. ముగ్గురు నిందితులు సాక్షులుగా మారారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రాతో పాటు ఆరుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. శిక్షపడిన వారిలో ఐఏఎస్‌ అధికారులు బెక్‌ జూలియస్‌, పూల్‌చంద్‌ సింగ్‌, మహేశ్‌ ప్రసాద్‌, ప్రభుత్వాధికారులు కృష్ణకుమార్‌, సుబీర్‌ భట్టాచార్య తదితరులు ఉన్నారు.


పశు గ్రాసం కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖజానా నుంచి 37.7 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో 2013 సెప్టెంబరు 20న లాలూతోపాటు జగన్నాథ్‌ మిశ్రాను కూడా కోర్టు దోషిగా ప్రకటించింది. దీంతో రెండు నెలలపాటు లాలూ జైలుజీవితం గడిపారు. ఎంపీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు ఎన్నికల్లో పోటీకి లాలూ అనర్హుడయ్యారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్‌ మంజూరవడంతో లాలూ బయటకు వచ్చారు. తాజాగా రెండో కేసులోనూ లాలూ దోషిగా తేలారు. ఈసారి ఖజానా నుంచి 3.97 కోట్ల రూపాయలు చట్టవిరుద్ధంగా విత్‌డ్రా చేసుకున్న కేసులో ఆయనకు శిక్ష ఖరారైంది.  ఇవి కాకుండా మరో మూడు కేసుల్లో తీర్పు వెలువడాల్సి ఉంది.
 

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

తుఫాను నష్ట తీవ్రతను తగ్గించాం

కాకినాడ: ముందు జాగ్రత్త చర్యలతో పెథాయ్‌ తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు సీఎం చంద్రబాబు. ఐవీఆర్‌ఎస్‌,...

రామ్మోహన నాయుడు ఒక్కరోజు దీక్షకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వేదికగా ఏపీ రాష్ట్ర హక్కుల కోసం పుట్టిన రోజున కూడా పోరాడుతోన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరా...

రేపు ఓటు జాబితాను సవరిస్తాం : పల్లా రాజేశ్వర్ 

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పల్లా

కేసీఆర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా

బిడ్డకు విడుదల...

పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ జైలు నుంచి రేపు...

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా ఐఏఎస్ పై ఎమ్మెల్యే ఫైర్...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె ఒక మహిళా అధికారిణి పైగా...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఓడిన భారత్

పెర్త్ టెస్ట్ లో భారత్ జట్టు ఓటమిపాలయ్యింది. రెండో ఇన్నింగ్స్

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...