న‌వంబ‌ర్ 2 నుంచి వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు. ఆరునెల‌ల పాటు మూడు వేల కిలోమీట‌ర్లు పాటు సుధీర్ఘ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. పాద‌యాత్రకు సంబంధించి కార్యాచ‌ర‌ణ‌కై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్తల‌తో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు.

పార్టీ నేత‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు జ‌గ‌న్ తీసుకున్నట్లు తెలిపారు ఎంపి మేక‌పాటి. స‌మావేశానికి హాజ‌రైన వారిలో సుమారు 50 మంది త‌మ‌తమ అభిప్రాయాల‌ను జ‌గ‌న్ ముందుంచిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగా ఎక్కువమంది స‌భ్యులు గ్రామస్థాయిలో బూత్ క‌మిటీల‌ను ప‌టిష్టం చేయాల‌ని సూచించిన‌ట్లు నేత‌లు స్పష్టం చేశారు. దీంతోపాటు టీడీపీ బ‌లంగా ఉన్న గ్రామాల్లో వైసిపి జెండా ఎగుర‌వేయాల‌ని నిర్ణయించారు. ప్రజా వ్యతిరేక విధానాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక స‌మ‌స్యల‌పై పాద‌యాత్రలో ఎక్కువుగా ఫోక‌స్ చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణయించారు. డ్వాక్రా మ‌హిళ‌లు పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగుల స‌మ‌స్యల‌పై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక 125 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ పాద‌యాత్ర కొనసాగుతుంది. మిగిలిన 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర త‌ర్వాత బ‌స్సు యాత్రను జ‌గ‌న్ చేప‌ట్టనున్నారు.

ఈ పాద‌యాత్ర ద్వారా వైసిపి శ్రేణుల్లో జోష్ నింప‌డంతో పాటు ప్రజా స‌మ‌స్యల‌ను నేరుగా తెలుసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు జ‌గ‌న్ హాజ‌రు కావాల్సి వుంది. వ్యక్తిగత హాజ‌రుపై మినహాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోర్టుకు పిటిష‌న్ దాఖ‌లు చేసారు. అయితే కోర్టు నుంచి మిన‌హాయింపు వ‌చ్చినా రాకపోయినా పాద‌యాత్ర చేస్తార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజ‌రౌతూ పాద‌యాత్రను జ‌గ‌న్ కొన‌సాగిస్తార‌ని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసారు. కాలిన‌డ‌క‌న తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనం చేసుకున్న త‌ర్వాత ఇడుపులపాయ‌కు రోడ్డుమార్గం గుండా వెళ్లిన త‌ర్వాత వైఎస్ ఘాట్ నుంచి పాద‌యాత్ర ప్రారంభం కానుందని నేత‌లు తెలిపారు.

 

e-max.it: your social media marketing partner

జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో...

విజయవాడలో బీజేపి నేతలు సమావేశం అయ్యారు

విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపి నేతలు సమావేశం నిర్వహిచారు. దుగరాజపట్నం పోర్ట్, కడపం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్...

కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ ను  ఏపీ బీజేపీ ప్రకటించింది

బీజేపీ నేతలు మాట్లాడుతూ, అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని అన్నారు.

రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు అన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్స...

రాజేంద్రనగర్‌ వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా

రాజేంద్రనగర్‌ శివరాంపల్లి వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. శివరాంపల్లి పీవీఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 2...

టి ఎస్ పి ఎస్ సి టెట్ పరీక్ష మొదలయింది

ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు TSPSC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిం...

మారణహోమాన్ని తలపిస్తున్న సిరియా అంతర్యుద్ధం

సిరియాలో అంతర్యుద్ధం మారణహోమాన్ని తలపిస్తోంది. కొన్ని రోజులుగా ప్రభుత్వం తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న ప్రాంతా...

చైనా, పాక్ తీరుపై ఆర్మీ చీఫ్ స్పష్టత

డ్రాగన్, దాయాది పాకిస్థాన్ కుట్రల ఫలితంగానే ఈశాన్యభారతంలో బంగ్లాదేశీయుల అక్రమ వలసలు పెరుగుతున్నాయని ఆర్మీ చీఫ్...

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది

శాసనసభ్యుల కోటా కింద జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

కుంభకోణం కేసు వల్ల విక్రమ్ కొఠారిని సిబిఐ రిమాండ్ లో తీసుకుంది

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చి సుమారు 3వేల 700 కోట్ల మేరకు రుణాల ఎగవేతకు

కాంచీపురంలో కరుణైఇల్లమ్‌ ఆశ్రమంని చూసి బిత్తర పోతున్న అధికారులు

పట్టెడన్నం పెడతారని వెళితే, కనీసం పాడె కూడా పెట్టకుండా చేస్తున్న దుర్మార్గమిది!

తిరుమలలో కలకలం సృష్టించిన మృతదేహం

తిరుమల సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. డ్యాం వద్ద నీటిమడుగులో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వ...

యాంకర్ రష్మీ గౌతమ్ హృదయాన్ని కదిలించిన వైరల్ వీడియో

యాంకర్ రష్మీ గౌతమ్ హృదయాన్ని కదిలించిన వైరల్ వీడియో

ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ తన హృదయాన్ని కదిలించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

జీఎస్టీ కేసులో మరోసారి విచారణకు హాజరుకానున్న వర్మ

జీఎస్టీ కేసులో మరోసారి విచారణకు హాజరుకానున్న వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. జీఎస్టీ సినిమా సామాజిక కార్యకర్త దేవీపై అనుచిత వ్యాఖ...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

భారత్ బౌలర్ల కు దక్షిణాఫ్రికా తల వంచింది

సెంచూరియన్లో ఆరవ వన్డేలో భారత్ బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...