మిత్రపక్షం టీడీపీతో కలసి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి పోటిచేసిన బిజేపి నేత పైడికొండల మాణిక్యాలరావు తొలిసారిగా ఎమ్మెల్యే కావడమేకాదు ఏకంగా ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి పదవే దక్కింది.
దాంతో గత మూడు సంవత్సరాలుగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూనే చంద్రబాబుకు అతి సన్నిహితుడుగా మెలుగుతుండటం చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకొలేక పోతున్నారు. ఇదే క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తో తరచూ విభేదాలు తలెత్తుతున్న తరుణంలో ఈ మూడేళ్ళుగా మిత్రపక్షం నాయకులతో కలసి ప్రయాణం చేశారు.