దేశంలో భారతీయ జనతా పార్టీ అంచనాలకు అందనంతగా కొత్తరూపాన్ని ఆపాదించుకుంటోంది. తూర్పు దిల్లీ కార్పొరేషన్‌లోని 63, ఉత్తర ఢిల్లీలోని 103, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌లోని 104 వార్డులకు ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. దీంతో మరోసారి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీజేపీ వశమైంది. గత పదేళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉండటం విశేషం. ఇక అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం కూడా  పెరిగింది. ఇక ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్‌ ఆద్మీ ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకున్నా గెలుపును సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరి పెట్టుకుంది.

MCD RESULTS 2017:

NORTH DELHI: BJP66- AAP20- INC15- OTH2

SOUTH DELHI: BJP70- AAP16-INC12- OTH6

EAST DELHI: BJP48- AAP10- INC3- OTH2

Final Score:

BJP – 184 wards

AAP – 46 wards

Congress – 30 wards

Others - 10 wards

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజధాని దిల్లీలో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. దిల్లీ నగరపాలక ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ పాలనకు దిల్లీ ప్రజలు పట్టం కట్టారని, రెండేళ్ల ఆప్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని అమిత్‌ షా అన్నారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఆప్‌ చేస్తున్న వ్యాఖ్యలను అమిత్‌ షా ఖండించారు. 2015 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల అధికారంలోకి వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్యర్యాన్ని కల్గిస్తోందని అన్నారు. విమర్శల రాజకీయాలను దిల్లీ ప్రజలు తిరస్కరించారని, విమర్శలతో ఆప్‌ తన గొయ్యి తానే తవ్వుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని దిల్లీ ప్రజలు నిర్ధరించారని పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికల్లో భాజపా విజయం, ఆప్‌ పరాజయాలను మరోసారి ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. అయితే ఇదంతా బీజేపీ, ప్రధాని మోదీ ప్రభావం కాదని... కేవలం ఈవీఎంల మాయేనని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 'దశాబ్ద కాలంగా దిల్లీ రోడ్లను కూడా వూడ్వని బీజేపీ ఎన్నికల ఫలితాలను మాత్రం వూడ్చేస్తుంది. ఎందుకంటే ఓటింగ్‌ మిషన్లు మీతో ఉన్నప్పుడు ఇక ఓటర్ల అభిప్రాయంతో సంబంధం ఏముంటుంది' అని ఆప్‌ నేత నాగేందర్‌ శర్మ ఆరోపణలు చేశారు. 

ఎన్నికల ఫలితాలపై అటు దిల్లీ మంత్రి గోపాల్‌రాయ్‌ కూడా స్పందించారు. 'ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిచిందా ఓడిందా అనేది చిన్న విషయం. కానీ ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంలు నిర్ణయిస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం' అని అన్నారు. ఇక ఆప్‌ నేత అశుతోష్‌ మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయన్నారు. విద్యుత్‌ రేట్లు తగ్గించి, స్కూళ్లు, ఆసుపత్రులు మెరుగుపరిచి, ఉచితంగా నీళ్లిచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదంటే నమ్మకం కలగడం లేదు. దీని వెనుక వేరే కారణం ఉండొచ్చు అని ఈవీఎంలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

మొత్తం మీద కమలం వికసించింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏ మీట నొక్కినా భాజపాకే ఓటు పడుతుందని కేజ్రీవాల్‌ సహా మరికొన్ని పార్టీలు ఆరోపించాయి. అలాంటి ఈవీఎంలను దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వినియోగించొద్దని ఆప్‌ హైకోర్టును కూడా ఆశ్రయించింది. వాటి స్థానంలో బ్యాలెట్‌ పత్రాలను లేదంటే రశీదిచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని డిమాండ్‌ చేసింది. అయితే సమయం మించిపోవడంతో ఎలాంటి మార్పులకు తాము ఆదేశాలివ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటి పైకి తెచ్చే ప్రయత్నాలు తెగ జరుగుతున్నాయి. ప్రధాని మోడీ దూకుడుకు కళ్లెం వేయాలంటే విపక్షాలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టక తప్పదని డిసైడ్ అయి రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఐక్యతను చాటేందుకు రెడీ అవుతున్నారు. ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా మేమున్నామని ఓటర్లకు స్పష్టమైన సంకేతాలు ఇప్పటినుంచీ వెళ్తేనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టు లెక్కని వీరు భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో ఆనం బ్రదర్స్ మార్కే వేరు. ఆనం సోదరులు కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. సొంత కేడర్‌తో వ్యవహారాలు సాగిస్తూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంక్షోభంలో కూరుకున్నా అదే పార్టీలో కొనసాగారు. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించి సోదరుడు వివేకాతో చర్చించినప్పుడు వివేకా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదంటారు. ఇప్పట్లో కాంగ్రెస్‌ బలపడే పరిస్థితి లేదని రాజకీయ భవిత్యం కోసం టీడీపీలో చేరడం సముచితమని రామనారాయణరెడ్డి వివేకాను సముదాయించి తమ అనుచరులతో సైకిలెక్కాలని ఫిక్స్ అయ్యారంటారు. 2016 జనవరి 17న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సీఎం సమక్షంలో ఆనం బ్రదర్స్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు, వివేకాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

2014 ఎన్నిక‌ల‌లో విజ‌యం త‌మ‌దే ఆని భావించి భంగ‌ప‌డిన వైసీపీ ఆదినేత జ‌గ‌న్, వచ్చే సార్వత్రిక ఎన్నిక‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను లైప్ ఆండ్ డెత్ గా బావిస్తున్న జ‌గ‌న్ ఆటు పార్టీ నేతల‌ని గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలుతో ప‌రుగులు పెట్టిస్తూనే.... ఇత‌ర ఆవ‌కాశాల‌ని ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నారంట.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

తూర్పుగోదావరి జిల్లాలో పొలంలో రైతు దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన చుండ్రు రాఘవులు అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు....

మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్ల ఆగ్రహం

విశాఖ మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఏర్పా...

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇరువురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన షబ్బీర్ హుస్సేన్ కుటుంబం ఆసిఫా...

ఆలేరులో పాముకాటుకు బాలుడు బలి

యాదాద్రి జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. స్థానిక చింతలబస్తీకి చెందిన నితిన్ అనే బాలుడు పాముకాటుకు గురవ్వగా బాల...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేష‌న్

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధిం...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...