ఇంకా 48 గంటలు కూడా కాలేదు..! ఈ కేసుకు సంబంధించిన మూడో మరణం సంభవించింది. వ్యాపమ్ ద్వారా ట్రైనీ ఎస్సైగా నియమితుడైన ఓ వ్యక్తి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు..!  ఈ మరణాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఘాటుగానే స్పందించారు. ప్రతి మరణాన్ని వ్యాపమ్ తో ముడిపెట్టరాదని సూచించారు. మరోవైపు ఈ కేసులో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేష్ యాదవ్ పీఠం కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గవర్నర్ ను తొలగించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న వ్యాపమ్ స్కాంలో మృత్యు ఘోష మోగుతూనే ఉంది. శని, ఆది వారాల్లో చోటుచేసుకున్న జర్నలిస్టు, మెడికల్ ప్రొఫెసర్ మరణాలపై ఓ వైపు దుమారం కొనసాగుతుండగానే...... ఈ కేసుతో సంబంధం ఉన్న  మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది వ్యాపమ్ ద్వారా ఎస్సైగా నియమితుడైన అనామికా కుష్వాహా సాగర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఉదయం ఓ చెరువులో కుష్వాహా శవమై కనిపించాడు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉండి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన  వారి సంఖ్య 48కి చేరింది. 

వ్యాపమ్ మరణాల విషయంలో వస్తున్న విమర్శలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. చౌహాన్ సూచించారు.  మధ్యప్రదేశ్ లో సంభవించే ప్రతి మరణాన్ని వ్యాపమ్ తో ముడిపెట్టరాదని గతంలో జబల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు జరిపించడం లేదని ఆయన తెలిపారు.అటు కాంగ్రెస్ పార్టీ... వ్యాపమ్ స్కాంపై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉంది. సీబీఐ దర్యాప్తు జరిపించరాదని జబల్ కోర్టు ఎప్పుడూ తీర్పు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాల్ అన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ అందరినీ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కుంభకోణంపై స్పందించింది.  ఈ కేసు దర్యాప్తు సరిగ్గానే జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  దర్యాప్తు పట్ల మధ్యప్రదేశ్  హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా సంతృప్తిగానే ఉన్నాయని...సీబీఐ విచారణ చేయాల్సించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదీ ఏమైనా ఈ కుంభకోణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోదనేది వాస్తవం..! దర్యాప్తులో భాగంగా ఇంకా ఎందరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి..! 

దర్యాప్తు బృందం ఇప్పటి వరకు 2 వేల మందిని అరెస్టు చేసింది.! ఇంకా 8 వందల మందిని అరెస్టు చేయాల్సింది...అయితే ఈ కేసుతో సంబంధమున్న కీలక నిందితులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందండం మిస్టరీగా మారింది. మృతి చెందిన వారిలో గవర్నర్ కొడుకు నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు ఉన్నారు.

ఇది కథ కాదు...! ఇట్స్ ఏ రియల్ స్టోరీ...., అన్ని  మిస్టిరియస్ డెత్స్...! ఈ మరణ మృదంగం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది...?  కేసులు నమోదు అవుతూనే ఉన్నాయ్...! ఇవాళ ఇద్దరు..., రేపు ఎవరో...? ఎల్లుండి ఇంకా ఎంతమందో చెప్పలేం..! ఈ సీరియల్ కిల్లింగ్స్ అన్ని ఓ కుంభకోణం చుట్టు తిరుగుతున్నాయి. అదే మధ్య ప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్...షార్ట్ కట్ లో వ్యాపమ్ స్కామ్..!

ప్రకాశం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయబావుటా ఎగరవేసింది. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు. మొత్తం 992 ఓట్లకుగానూ... 755 ఓట్లు పోల్ అయ్యాయి. మాగుంటకు 724 ఓట్లు వచ్చాయి. 

కేంద్రం పథకాలు అమలు కావాలంటే బీజేపీని గెలిపించండి...

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈరోజు శేరిలింగంపల్లిలోని హఫీ...

కాంగ్రెస్ కు రెబల్స్ బెడద...

తెలంగాణ ఎన్నికల్లో టి.కాంగ్రెస్ కు రెబల్స్ బెడద తప్పట్లేదు. ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ మ...

ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖమంత్రి...

శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర హోంశాఖమంత్రి హన్స్ రాజ్ గంగారం మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తిత్లీ తుఫాను బాధి...

శివ నామ స్మరణతో మార్మోగిన ఆలయాలు...

ప.గో: కార్తీక మాసం రెండవ సోమవారం ఏకాదశీ కూడా కలిసి రావడంతో శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో, శివ...

బైక్ పై తరలిస్తున్న రూ.7 లక్షలు సీజ్

తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసులు చేస్తోన్న వాహన తనిఖీల్లో భారీగా సొమ్ము పట్టుబడుతోంది. తాజాగా సూర్యాపేట...

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పోటీ...

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగా...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

దుబాయ్ పర్యటనలో నారా లోకేష్...

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి...

సుష్మాస్వరాజ్‌ సంచలన నిర్ణయం...

కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ సంచలన...

పుల్గాన్ ఆయుధ గోదాంలో పేలుడు

మహారాష్ట్ర వార్ధాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో ఈరోజు ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. భారత సైన్యానికి చెందిన...

రూ.11లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

గోవా: ఓ నైజీరియన్‌ డ్రగ్స్ సరఫరా చేస్తూ ఈరోజు పోలీసులకు పట్టుబడ్డాడు. గోవాలోని కాలన్‌గుటే పోలీసులు అతన్ని అరెస...

25మంది ఎస్సైలతో కార్డన్ సెర్చ్...

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తాండలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఎస్బీఐ బ్యాంకు వినియోగదారులకు మరో షాక్...

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) రోజూవారీ నగదు ఉపసంహరణను మరింతగా తగ్గించింది. అక్టోబర్ 31 నుంచి మ్యాస్...

ఐటీ కంపెనీల అధినేతలతో చంద్రబాబు భేటీ

ఐటీ కంపెనీల సీఈవోలు, కంపెనీల అధినేతలతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఐటీ...