సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన ఎంఎల్ఏను.. ఆయన నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు... ఈమేరకు భారీ బ్యానర్లు వేసి.. అభినందనలు తెలుపుతుండడం విశేషం. బలవంతంగా పన్నీర్ తో రాజీనామా చేయించారన్న వార్తతో.. ఇటు తమిళ ప్రజలు.. అటు తమిళ నేతలు.. పన్నీర్ ను, ఆయనకు మద్దతిస్తున్న ఎంఎల్ఏలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తమిళ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో ఎవరికీ అర్థం కాకుండా తయారవుతోంది. పన్నీర్ నే సీఎంగా కొనసాగించాలని నెటిజన్లు, ప్రజలు అత్యధిక శాతం ఆకాంక్షిస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కడికక్కడ శశికళ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. మరోవైపు తమిళ సినీరంగం సెల్వానికే  మద్దతు పలుకుతోంది. ఇటు చూస్తే శికళకు ఏ పార్టీ నుంచి మద్దతు లభించకపోగా ఆమె శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా చేజారి పోతున్నారు. అవి చాలదన్నట్లు శశికళకు కోర్టు కేసులు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు శశికళ సీన్ రివర్స్ అవ్వడానికి కారణమేంటి?

తమిళనాడులో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై వచ్చిన తర్వాత సంప్రదాయాల అనుసారం మొదట ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అనంతరం గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పన్నీరు సెల్వానికి రాష్ట్ర ప్రజలు, యువత అండగా ఉండగా శశికళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెన్నై సమీపంలో ఓ రిసార్ట్ లో ఉంచిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.

తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మధ్యాహ్నం ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి రానుండటంతో తదుపరి పరిణామాలకు రాజ్‌భవన్ వేదిక కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు శశికళ, ఆమెకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు ఆయన్ను కలవనున్నారు.

శశికళ టీం జైలు పాలవ్వడంతో చిన్నబోయిన నేతాశ్రీలు

అక్రమాస్తుల కేసుల కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతాశ్రీలు మన దేశంలో చాలా మందే కనిపిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టు...

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి

తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పళనిస్వామితో పాటు 31మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశ...

తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్...

మార్చి 3 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 3 నుంచి వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 25 లోగా ఏపీ అసెంబ్లీ భవన ని...

నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం

అభివృద్ధి ప‌నుల కోసం నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం చిక్కింది. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగి...

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వేరుశనగ రైతులు

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుతున్నారు వేరుశనగ రైతులు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బోరుబావుల ఆధారంతో వేరుశనగ స...

న్యూజిలాండ్ అటవీ ప్రాంతాల్లో మంటలు...శ్రమిస్తున్న సిబ్బంది

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. మంటలు త్వరితగతిన వ్యా...

కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులు అరెస్ట్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చే...

అభివృద్ది ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:వెంకయ్యనాయుడు

దేశంలో ప్రధాన మంత్రి మోడీ మూడు అంశాలకు ప్రధాన్యం ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో అభివృద్ద...

యూపీలో తొలి విడత కంటే రెండో దశలోనే ఎక్కువ పోలింగ్

ఉత్తరప్రదేశ్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి....

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

మళయాళ సినీనటి భావన కిడ్నాప్‌...డ్రైవర్ మార్టిన్‌ అరెస్ట్

సినీనటి భావన కిడ్నాప్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

మెగా మేనల్లుడు ఈసారి గట్టిగా కొట్టాడానికి ప్రిపేర్ అయ్యాడు. కొత్త సినిమా 'విన్నర్'తో సాయిధరమ్ తేజ్ స్టార్ డమ్...

బీసీసీఐ కమిటి హెడ్ వినోద్ రాయ్ కు శ్రీశాంత్ లేఖ

వివాదాస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని రద్దు చేయాలంటూ మాజీ కంట్రోలర్‌ అండ్‌ ఆడి...

మీడియాపై సానియా ఆగ్రహం...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తన...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...