దేశంలో 56శాతం రిజ‌ర్వేష‌న్లు బీసిల‌కు క‌ల్పించ‌మ‌ని కోరుతున్న ప్ర‌భుత్వాలు పట్టించుకొవ‌టం లేద‌ని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జాతీయ బిసి క‌మిష‌న్ కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే ప్ర‌తిప‌క్షాలు ఓర్వ‌లేక‌పొతున్నాయన్నారు. పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి చట్డసభల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణా, ఏపి సీఎంలు ఇద్దరూ అఖిలపక్షాన్నిఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్‌ కంపెనీలపై చూపించే శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై చూపకపోవడం వల్లే వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురించాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల ఆందోళనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఈ సీజన్‌లో మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో ఎంత వేయాలో రైతులకు ముందుగా తెలియజేయడంలో సర్కార్ల వైఫల్యమే కారణమని తమ పార్టీ భావిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల పట్ల, వారి సమస్యల పట్ల చిన్నచూపు మాని క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. గతేడాది క్వింటాల్ మిర్చికి రూ.13 వేల 500 ధర పలికినందున, ఇప్పుడు కనీసం రూ.11వేల చొప్పున‌ రైతుకు గిట్టుబాటు ధరగా ఇవ్వాలన్నారాయన. మార్కెట్లో ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని జనసేనాధినేత డిమాండ్‌ చేశారు.

చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యవహారం సమసిపోయింది. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబుపై, ప్రభుత్వంపై విమర్శలు చేసిన శివప్రసాద్ ఆ తరువాత సొంత పార్టీ నేతలతోనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో గత కొన్ని రోజులుగా మంత్రులు, పార్టీ సీనియర్లు మంతనాలు జరిపి చంద్రబాబుతో ఎంపి శివప్రసాద్ భేటీ అయ్యేలా చేశారు. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన శివప్రసాద్ ఇవాళ తిరుపతిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనకు చిన్ననాటి మిత్రుడని ఏదో చిన్న మనస్పర్దల వల్లే గతంలో మాట్లాడానన్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యాక ఆయన ఎందుకు తనతో మాట్లాడటం లేదో అర్థమైందన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితులు వివరించానని, త్వరలోనే పార్టీని అన్ని రకాలుగా జిల్లాలో అభివృద్ది చేస్తానన్నారు. చంద్రబాబు తనకు క్లాస్ తీసుకున్నారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు ఎంపి శివప్రసాద్.

మేలో కీలకమైన భేటీ ఏర్పాటుచేసి వ్యూహాన్ని రచించేందుకు, ఎత్తులకు పదునుపెట్టే కీలక పనులను ప్రారంభించే ఛాన్స్ ఉంది నాన్ బీజేపీ ఫ్రంట్. నాన్ బీజేపీ ఫ్రంట్ గా జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించి దాని సత్తాను రాష్ట్రపతి ఎన్నికల్లో రుచిచూపించే పనిలోపడేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి పలు ప్రాంతీయ పార్టీలు.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

తూర్పుగోదావరి జిల్లాలో పొలంలో రైతు దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన చుండ్రు రాఘవులు అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు....

మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్ల ఆగ్రహం

విశాఖ మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఏర్పా...

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇరువురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన షబ్బీర్ హుస్సేన్ కుటుంబం ఆసిఫా...

ఆలేరులో పాముకాటుకు బాలుడు బలి

యాదాద్రి జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. స్థానిక చింతలబస్తీకి చెందిన నితిన్ అనే బాలుడు పాముకాటుకు గురవ్వగా బాల...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేష‌న్

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధిం...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...