సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. రజినీ రాజకీయాల్లో కి వస్తున్నారని తెలియడంతో ఆయన సొంత పార్టీతో ఎంట్రీ ఇస్తారా లేక ఏదైన పార్టీలో చేరుతారా అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అయితే రజినీ పొలిటికల్ ఎంట్రీ వార్తలతో ఆయనకు గాలం వేసేందుకు పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.  

జయమరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. ప్రజలను ఆకట్టకునే చరిష్మా ఉన్న నాయకులు  కరువరయ్యారు. కరుణానిధి ఉన్నా ఆయన చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కొడుకు స్టాలినే పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో తమిళ రాజీకీయాలకు రజినీ ప్రత్యామ్నాయంగా మారారు. ఇటు ప్రజలలో కూడా రజినీ కి మంచి పేరుంది. దీంతో  కొన్ని పార్టీలు రజినీకి గాలం వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బలమైన సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు గాలం వేసేందుకు బీజేపీ ఎంతమాత్రం వెనుకాడటం లేదు. కమలం గూటికి రారమ్మని రజనీని బీజేపీ నేతలు ముక్తకంఠంతో ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రజనీ కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని అమిత్‌ షా పేర్కొనగా తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సైతం లాంఛనంగా రజనీని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో ఆయనకు సముచిత స్థానం కట్టబెడతామని ఆశ చూపారు. సముచిత స్థానం అంటే తమిళనాడు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్‌ను ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా అది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని గడ్కరీ చెప్పుకొచ్చారు.

అదేవిధంగా రజనీకాంత్ త్వరలోనే ఢిల్లీ వెళ్లి, మోడీతో భేటీ అవుతారని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతున్నది. ఆ భేటీ తర్వాతే రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇవ్వవచ్చన్నది చెన్నై టాక్.  దీనిపై రజనీకాంత్ ఇప్పటివరకు పెదవి విప్పకపోగా, ఆయన బీజేపీలో చేరాలని ఆ పార్టీ వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. మరి తలైవా బీజేపీలో చేరుతారా లేక సొంత కుంపటి పెడతారా అన్నది వేచిచూడాలి. 

సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినవాళ్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం రాజకీయ హత్యలపై కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా దోషులను పట్టుకోకుండా కర్నూలు ఎస్సీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి 'ఏపీలో ఆటవిక పాలన సాగుతున్నదని విమర్శించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజల కోసం పనిచేస్తూ దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. మూడు రోజుల పాటు నేతలు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతిచ్చే జాతీయ పార్టీల నాయకులను కలవనున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పలువురు జాతీయ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రత్యేకహోదా సాధన అంశాలపై రాహుల్ తో చర్చించామని నేతలు తెలిపారు.

    

విభజిత రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ లో అమిత్ షా పర్యటన చేస్తాడంటూ మండిపడ్డారు అనంతపురం కాంగ్రెస్ నేతలు. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ అమిత్ షా గోబ్యాక్ అంటూ అనంతపురంలో ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలో పెట్టిన అనేక హామీలు అమలు చేయకుండా రాజకీయాలు చేయడానికి అమిత్ షా వస్తున్నాడని పార్టీ జిల్లా అధ్యక్షులు కోటాసత్యం విమర్శించారు. 

 

ప్రధాని విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంస...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

విశాఖలో ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన

విశాఖలో ఆర్టీసీలో పనిచేస్తున్న హైర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్.ఎమ్ ఆఫీస్ వద్ద పెద్దఎత్తున ఆం...

కడప జిల్లాలో రోడ్డుప్రమాదం..ఇద్దరి మృతి

కడప జిల్లా బద్వేల్ కృష్ణపట్నం ఎన్.హెచ్.జీ జాతీయ రహదారిలోని హరితహోటల్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద...

మంచిర్యాల జిల్లాలో బొగ్గుగనులపై ఏఐటీయూసీ నాయకుల ధర్నాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులపై ఏఐటీయూసీ నాయకులు ధర్నాలు చేపట్టారు. సింగరేణి కార్మికుల న్యాయ...

డ‌బుల్ బెడ్ రూమ్స్ పేద‌ల కోస‌మే...

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ‌లోని అర్హులైన పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నామ‌న్న...

ఇస్లామిక్‌ స్టేట్‌లో జర్మనీ యువతి ఆవేదన

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీకి చెందిన యువతి తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్...

అమెరికాలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గత శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియానాకు చెందిన తెలుగు దంపతులు ప్రయాణిస్...

మళ్లీ వేడెక్కిన బీహార్‌ రాజకీయాలు

బీహార్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అనూహ్య పరిణామాల మధ్య బీహార్ సీఎంగా నితీశ్ తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నార...

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి చంద్రబాబు కేంద్రమంత్ర...

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్

తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. శ్రీకాళహస్తి అమ్మపాలెంకు చెందిన బండి సురేష్ దంపతుల కూతురైన 7 ఏళ్ల న...

డ్రగ్స్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన ఛార్మీ

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ అధికారుల విచారణా తీరు సరిగ...

హీరో సూర్యతో నటించాలనుకుంటున్న సాయిపల్లవి

హీరో సూర్యతో నటించాలనుకుంటున్న సాయిపల్లవి

కాలేజ్ డేస్ లో తాను ఎక్కువగా హీరో సూర్యను అభిమానించేదానినని తెలిపింది 'ఫిదా' కథానాయిక సాయిపల్లవి. ఆయన సినిమాలన...

'పైసా వసూల్' తో అభిమానుల ముందుకు రానున్న బాలయ్య

'పైసా వసూల్' తో అభిమానుల ముందుకు రానున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా అభిమానుల ముందుకు రానుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...