తమిళనాడులో మన్నార్‌గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు వ్యూహరచనలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చిన్నమ్మ కుటుంబం, బినామీలను టార్గెట్‌ చేసి త్వరలో మరన్ని దాడులకు ఆస్కారం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్ముందు చిన్నమ్మకు మరిన్ని షాక్‌లు తగిలే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కలకలం చోటుచేసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ కటౌట్లు, బ్యానర్లను తొలగించడం చర్చకు దారితీసింది. లంచం కేసులో దినకరన్‌ అరెస్టైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

దేశంలో భారతీయ జనతా పార్టీ అంచనాలకు అందనంతగా కొత్తరూపాన్ని ఆపాదించుకుంటోంది. తూర్పు దిల్లీ కార్పొరేషన్‌లోని 63, ఉత్తర ఢిల్లీలోని 103, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌లోని 104 వార్డులకు ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. దీంతో మరోసారి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీజేపీ వశమైంది. గత పదేళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉండటం విశేషం. ఇక అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం కూడా  పెరిగింది. ఇక ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్‌ ఆద్మీ ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకున్నా గెలుపును సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరి పెట్టుకుంది.

MCD RESULTS 2017:

NORTH DELHI: BJP66- AAP20- INC15- OTH2

SOUTH DELHI: BJP70- AAP16-INC12- OTH6

EAST DELHI: BJP48- AAP10- INC3- OTH2

Final Score:

BJP – 184 wards

AAP – 46 wards

Congress – 30 wards

Others - 10 wards

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజధాని దిల్లీలో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. దిల్లీ నగరపాలక ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ పాలనకు దిల్లీ ప్రజలు పట్టం కట్టారని, రెండేళ్ల ఆప్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని అమిత్‌ షా అన్నారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఆప్‌ చేస్తున్న వ్యాఖ్యలను అమిత్‌ షా ఖండించారు. 2015 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల అధికారంలోకి వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్యర్యాన్ని కల్గిస్తోందని అన్నారు. విమర్శల రాజకీయాలను దిల్లీ ప్రజలు తిరస్కరించారని, విమర్శలతో ఆప్‌ తన గొయ్యి తానే తవ్వుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని దిల్లీ ప్రజలు నిర్ధరించారని పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికల్లో భాజపా విజయం, ఆప్‌ పరాజయాలను మరోసారి ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. అయితే ఇదంతా బీజేపీ, ప్రధాని మోదీ ప్రభావం కాదని... కేవలం ఈవీఎంల మాయేనని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 'దశాబ్ద కాలంగా దిల్లీ రోడ్లను కూడా వూడ్వని బీజేపీ ఎన్నికల ఫలితాలను మాత్రం వూడ్చేస్తుంది. ఎందుకంటే ఓటింగ్‌ మిషన్లు మీతో ఉన్నప్పుడు ఇక ఓటర్ల అభిప్రాయంతో సంబంధం ఏముంటుంది' అని ఆప్‌ నేత నాగేందర్‌ శర్మ ఆరోపణలు చేశారు. 

ఎన్నికల ఫలితాలపై అటు దిల్లీ మంత్రి గోపాల్‌రాయ్‌ కూడా స్పందించారు. 'ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిచిందా ఓడిందా అనేది చిన్న విషయం. కానీ ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంలు నిర్ణయిస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం' అని అన్నారు. ఇక ఆప్‌ నేత అశుతోష్‌ మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయన్నారు. విద్యుత్‌ రేట్లు తగ్గించి, స్కూళ్లు, ఆసుపత్రులు మెరుగుపరిచి, ఉచితంగా నీళ్లిచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదంటే నమ్మకం కలగడం లేదు. దీని వెనుక వేరే కారణం ఉండొచ్చు అని ఈవీఎంలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

మొత్తం మీద కమలం వికసించింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏ మీట నొక్కినా భాజపాకే ఓటు పడుతుందని కేజ్రీవాల్‌ సహా మరికొన్ని పార్టీలు ఆరోపించాయి. అలాంటి ఈవీఎంలను దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వినియోగించొద్దని ఆప్‌ హైకోర్టును కూడా ఆశ్రయించింది. వాటి స్థానంలో బ్యాలెట్‌ పత్రాలను లేదంటే రశీదిచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని డిమాండ్‌ చేసింది. అయితే సమయం మించిపోవడంతో ఎలాంటి మార్పులకు తాము ఆదేశాలివ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటి పైకి తెచ్చే ప్రయత్నాలు తెగ జరుగుతున్నాయి. ప్రధాని మోడీ దూకుడుకు కళ్లెం వేయాలంటే విపక్షాలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టక తప్పదని డిసైడ్ అయి రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఐక్యతను చాటేందుకు రెడీ అవుతున్నారు. ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా మేమున్నామని ఓటర్లకు స్పష్టమైన సంకేతాలు ఇప్పటినుంచీ వెళ్తేనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టు లెక్కని వీరు భావిస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయం నుండి శశికళ, దినకరన్‌ బ్యానర్లు తొలగింపు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కలకలం చోటుచేసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్క...

అరవింద్ కేజ్రీవాల్ కు సరికొత్త సమస్య...

అరవింద్ కేజ్రీవాల్ కు సరికొత్త సమస్య మొదలైంది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపా...

నెల్లూరులో బాహుబలి సందడి

నెల్లూరు జిల్లాలో బాహుబలి-2 సందడే సందడి నెలకొంది. నెల్లూరులో సినిమా హిట్ అయితే అది బ్లాక్ బస్టర్ అవుతుందనేది ఒ...

కోడుమూరులో నిలిపివేసిన బాహుబలి 2 సినిమా ప్రదర్శన

కోడుమూరులో బాహుబలి 2 సినిమా ప్రదర్శనను నిలిపేశారు. థియేటర్ యాజమాన్యానికి, అభిమానులకు మధ్య విభేదాలు రావడంతో ప్ర...

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం:ఉత్తమ్ కుమార్ రెడ్డి

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా...

ఖమ్మం మిర్చి యార్డ్ పై రైతుల దాడి

ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ పై రైతులు దాడిచేశారు. మిర్చికి కనీస మద్దతు ధర కల్పించకుండా, జెండా పాట నిర్వహించకప...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

ఒడిశాలో మావోయిస్టుల మారణ హోమం...

మావోయిస్టుల మారణ హోమం రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భారీ సంఖ్యలో సీఆర్...

సుబ్రతో రాయ్ ను హెచ్చరించిన సుప్రీం కోర్టు

జూన్ 15వ తేదీలోగా 2వేల 550 కోట్లు షేర్ హోల్డర్స్ కు చెల్లించలేకపోతే జైలుకెళ్లక తప్పదని సహారా గ్రూప్ అధినేత సుబ...

యువకుడిని చితకబాదిన ఎస్సై...అపస్మారక స్థితిలో ప్రవీణ్

మైనర్ బాలికను ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఆ యువకుడు అప...

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

రైలు నుంచి ఓ యువకుడిని దింపి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

రాజమౌళి గురించి తెలియని నిజం ఇదే!

రాజమౌళి గురించి తెలియని నిజం ఇదే!

దర్శక దిగ్గజం, బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో దేవుడికి సంబంధించిన సన్నివేశం ఉంటుంద...

'బాహుబలి-2' మూవీ రివ్యూ...

'బాహుబలి-2' మూవీ రివ్యూ...

Bahubali-2 సమర్పణ: కె.రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌ టైటిల్: 'బాహుబలి-2':ది కంక్లూజన్ తార...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న 'గంభీర్'

కేకేఆర్ కెప్టెన్ గౌతం గంభీర్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న గంభీర్ ప్రస్తుతం టాప్ స్కోరర్ గా...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...