nobel peace prize winners

2018 నోబెల్ శాంతి బహుమతి ఇద్దరిని వరించింది. వీరిలో ఓ మహిళ ఉండడం గమనార్హం. ఇరాకీ మహిళ, అత్యాచార బాధితురాలు నదియ మురాద్ నోబెల్ శాంతి బహుమతి

ఎంపికయ్యారు. ఈమెతోపాటు కాంగో దేశానికి చెందిన డాక్టర్ డెనిస్ ముక్వెగేను కూడా దీనికి ఎంపిక చేశారు. ఇరాక్ కు చెందిన నదియ మురాద్ ను ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో లైంగికదాడికి గురయ్యారు. ఐఎస్ఐఎస్ కు బాగా పట్టున్న యాజిడి ప్రాంతానికి చెందిన మురాద్ తీవ్ర వాదుల చేతుల్లో చిక్కారు. ఆమెపై తీవ్ర వాదులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దుర్ఘటన ఆమెలో పెనుమార్పులకు దారి తీసింది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం మొదలుపెట్టారు. యాజిడి ప్రాంతంలో ఏ మహిళ కూడా తనలా బాధితురాలు కాకూడదన్న పట్టుదలతో ముందుకు సాగారు. ఆ ఉద్యమంలో ఆమెకు ఎన్నో బెదిరింపులు ఎదురయ్యాయి. వాటన్నటిని సహించారు. ఎదుర్కొన్నారు. ముందుకే సాగారు. మురాద్ సాగించిన శాంతియుత ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదే ఆమెను నోబెల్ శాంతి పురస్కారానికి దగ్గర చేసింది. 

ఇక కాంగో దేశానికి చెందిన డాక్టర్ డెనిస్ ముక్వెగేది కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. వృత్తిరీత్యా ఆయన గైనకాలజిస్ట్. కాంగోలో అంతర్యుద్ధంతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, మరోవైపు పోలీసులు, మిలటరీ బలగాలు మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు. ఇరు వర్గాలకు మహిళలు లక్ష్యంగా మారిపోయారు. లైంగికదాడులకు గురవుతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట, ఎందరో కొందరు బాధితులు. వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక డాక్టర్ డెనిస్ ముక్వెగేను ఈ విషయం కలచివేసింది. తన సేవలను కేవలం రేప్ బాధితులకు అండగా నిలిచారు. లైంగిక దాడులకు గురవుతున్న వారికి వైద్యం చేయడం, వారిని కాపాడడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. మానసికంగా దెబ్బతిన్న వారిని కుదుటపరిచేలా చేయడం, వారిని తిరిగి మామూలు మనుషులను చేయడం తన విధిగా భావించారు డాక్టర్ డెనిస్. ఈ విషయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదే నోబెల్ శాంతి బహుమతిని ఆయన ముంగిట నిలిపింది. నిజంగా ఇద్దరూ గ్రేట్ కదూ.

e-max.it: your social media marketing partner

కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం...

హైదరాబాద్: ఓటరు నమోదు, ఓటరు జాబితాపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదుపై ప్రత...

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్...

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశ...

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించిన బాలకృష్ణ

హైదరాబాద్: రాష్ట్రంలో అణగారిన బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని ఆయన తనయు...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

హైదరాబాద్ లో భారీ పేలుడు... కారణం అదేనా?

హైదరాబాద్ లోని కాప్రా చౌరస్తాలో గల ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భవనంలోని సగ...

డేరా బాబాకు జీవిత ఖైదు...

ఢిల్లీ: డేరా బాబా గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధిస్తూ...

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...