Print
Hits: 639

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం (సునామీ)లో ధాటికి ఆ ద్వీపం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి ఆ ద్వీపంలోని వందలాది

మంది ప్రాణాలు, నివాసాలు కోల్పోయారు. ఈ ప్రక్రుతి విపత్తు మూలంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 1400కు చేరిందని బుధవారం అధికారులు వెల్లడించారు. దేశంలో వరుసగా రెండు పెద్ద భూకంపాలు సంభవించడంతో సునామీ విరుచుకుపడిందని అధికారులు వివరించారు. ఈ విపత్తు కారణంగా ఇల్లు, భవనాలు నెల మట్టవగా... రోడ్లు, బ్రిడ్జిలు నాశనమయ్యాయి. దాదాపు తీర ప్రాంతాలు అన్ని జలసమాధి అవగా... పెద్ద మొత్తంలో భవనాలు కూలడంతో వాటి కింద వందల సంఖ్యలో చిక్కుకుపోయిన వారిని రక్షించడం అధికారులకు కష్టంగా మారింది. శిథిలాల కింద చిక్కుకుని వారిని బయటకు తిస్తె అందులోనుంచి ప్రాణాలతో బయటపడే వారు కనపడట్లేదని ఓ అధికారి మీడియాతో అన్నారు.

e-max.it: your social media marketing partner