ఒక్కరోజు సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ తదిరులు ఉన్నారు. ఉదయం సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ను కలిసి అల్పాహారం తీసుకున్నారు. తర్వాత సింగపూర్ ఉప ప్రధాని తర్మన్ షన్ముగరత్నంతో కలిసి హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రమని చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో విశాలమైన రోడ్లు, భూగర్భ జల వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకుని రాజధాని ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ వంటి ఆధునిక నగరాన్ని నిర్మించిన అనుభవం తనకుందని అదే అనుభవం ఇక్కడ అక్కరకొచ్చిందన్నారు. భూమి సమస్య సవాల్ గా మారినప్పుడు ఒక్క పిలుపుతో రైతులు స్పందించిన తీరు అద్భుతమని చంద్రబాబు అన్నారు. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పడంతో ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ‌ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని కోరగా 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

సింగపూర్‌ పర్యటనలో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని అమరావతి నిర్మాణం విశేషాలను బాబు టోనీ బ్లెయిర్ కు వివరించారు. ఒకప్పటి తన హైదరాబాద్‌ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా‌లోని ఓ గ్రామాన్ని పరిశీలించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎప్పుడైనా భారత్ వెళ్తే ఏపీని తప్పకుండా సందర్శించాలని నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

టాటాసన్స్‌ బోర్డు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరగా ఐటీ రంగంతో పాటు అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖరన్ స్పష్టమైన హామీనిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో సింగపూర్ లో ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశాడు. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ ఆ అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

e-max.it: your social media marketing partner

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లోనే

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

ఆ ఇద్దరికీ రక్షణ కల్పించండి

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. అలా కోర్ట...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

విషాదం..పేలిన సిలిండర్

అనంతపురం జిల్లా కొత్తచెరువులో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో

అయేషా హత్యకేసు : సత్యంబాబు చెప్పిన సమాధానాలు

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...