అమెరికాలో మైక్రోసాఫ్ట్ ఇగ్నేట్ 2017 సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేదికలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన "హిట్ రిఫ్రెష్" పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. నాదెళ్ల సియాటెల్ లో ఉండే రోజుల్లో వివాహం చేసుకున్నారు. అప్పటి అమెరికా నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డు హోల్డర్ పెళ్లి చేసుకుంటే వారి భాగస్వామి వీసాను తిరస్కరిస్తారు.

ఈ నిబంధనలతో తన భార్య అనుపమ సియాటెల్ కు రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వెనకాముందు ఆలోచించకుండా భారత్ వచ్చి ఢిల్లిలో అమెరికా రాయబారి కార్యాలయంలో తన గ్రీన్ కార్డును వదులుకుని హెచ్ 1బీ వీసాకోసం దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత నాదెళ్ల, అనుపమ సియాటెల్ వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గ్రీన్ కార్డు వదులుకున్న నాదెళ్లను అందరు ఓ పిచ్చివాడ్ని చూసినట్లు చూశారు. తన వెనుక ఎన్నో మాటలనడం నాదెళ్ల విన్నట్లు కూడా హిట్ రిఫ్రెష్ పుస్తకంలో వివరించారు. తర్వాత ఇటువంటి పరిస్థితే చాలామందికి ఎదురైతే ఇతని సలహాల కోసం ఫోన్ లు కూడా చేసేవారు. నాదెళ్ల హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో తను ఓ చిన్న కళాశాలలో చదువుకొని బ్యాంకులో ఉద్యోగం చేయాలని కలగనేవారు. అలాగే హైదరాబాద్ తరపున క్రికెట్ ఆడాలనే అభిలాష కూడా ఉండేది. తనతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది ప్రముఖుల గురించి కూడా నాదెళ్ల తన పుస్తకంలో రాసారు. విండోస్, ఆండ్రాయిడ్, ఫేస్ బుక్ ల వంటి వినూత్న వేదికలతో ధీటుగా భారత్ లో "ఆధార్" విస్తృతి పెరిగిపోతోందని సత్య అభిప్రాయపడ్డారు. డిజిటల్, సాంకేతిక రంగాల్లో భారత్ చురుగ్గా ముందడుగేయడం ప్రశంసనీయమన్నారు. అలాగే నగదు రహిత లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఉపకరించే విశిష్ట డిజిటల్ మౌలిక వసతుల వ్యవస్థ "ఇండియా స్టాక్" గురించి సత్య తన పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లోకి రేవంత్ చేరికపై మీడియాలో పుకార్లు

కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తు...

సీపీయం పార్టీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు

సీపీయం పార్టీపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేరళలో హత్యా రాజకీయాలను సీఎం విజయన్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ పార...

పెరిగిన వంశధార నదికి వరద ఉధృతి

శ్రీకాకుళం జిల్లా వాసులకు వాయుగండం తప్పిందన్న ఆనందం కంటే వరదముప్పు తప్పలేదని బెంబేలు ఎక్కువయింది. నిన్నరాత్రి...

కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న వింత ఆచారం

కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం పెద్దహుత్తి గ్రామంలో కొనసాగుతున్న వింత ఆచారం. దీపావళి తరువాత మూడవరోజు బీరప్పస్వ...

పని చేసిన డబ్బులు చెల్లించడం లేదని తోటి కాంట్రాక్టర్ కిడ్నాప్

కాంట్రాక్ట్‌ పని చేసిన డబ్బులు చెల్లించడం లేదనే నేపంతో తోటి కాంట్రాక్టర్‌ను సినీ ఫక్కీలో అపహరించి బెదిరించి, క...

గన్స్ అమ్ముతున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తుల అరెస్ట్

రాచకొండ కమీషనరేట్ పరిధిలో గన్స్ అమ్ముతున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందిత...

సింగపూర్‌లో అమరావతికి భూములిచ్చిన రైతుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలౌతున్న వివిధ అభివృద్ధి పథకాలను...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

గబ్బిలాలు కోసం బాణసంచా నిషేధం

తమిళనాడు సేలం జిల్లాలోని ఒవ్వాల్ తోప్పు గ్రామంలో ప్రజలు దీపావళి పండుగను ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో జరుపుకున...

ముస్లింలకు ఫత్వా జారీ

తమ ఫొటోలు లేదా తమ కుటుంబసభ్యుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని దారుల్ ఉలూమ్ దియోబంద్ నిషేధించింది. ఉత్...

యామాపూర్ మాజీ సర్పంచ్ పై కాల్పులు జరిగిన దుండగులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజన్నపై అర్థరాత్రి దుండగులు కాల్పు...

కడపజిల్లాలో దారుణహత్య...

కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో దారుణహత్య జరిగింది. ఇంట్లో నిద్రపోతున్న గంగయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియన...

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది...

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీర...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

జీఎస్టీ పరిధిలోకి రానున్న రియల్ ఎస్టేట్

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ త...

నేడు, రేపు షీలాభిడే కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తొమ్మిదో షెడ్యూల్ లోని ప్రభుత్వ రంగసంస్థల విభజనపై ఇవాళ, రేపు షీలాభిడే నాయకత్వంలోని...