అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ప్రముఖ మోడల్ మెలానియా ట్రంప్ తన భర్త ట్రంప్ తో చాలా చిరాకుగా ఉంటున్నట్టు బాహాటంగానే కనిపిస్తోంది. కలసి ప్రయాణాలు చేస్తున్నా ఆమెలో మునుపటిలో ఉన్న హుషారుమాత్రం కనిపించడంలేదు. ఎందుకో ఆమె ట్రంప్ పై ఏమాత్రం ఆసక్తి చూపుతున్నట్టు లేదు. ఇజ్రాయెల్ పర్యటనలో ఇలా ఆమె అధ్యక్షుడి చేయిని విదిలించుకున్న తీరు ఇప్పుడు బాగా వైరల్ వీడియాగా మారింది.

ఇంగ్లండ్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఉగ్రమూక ఐసిస్ ప్రకటించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని భీకరదాడులు చేస్తామని పేర్కొంది. మరోవైపు మాంచెస్టర్‌లో జరిగిన విధ్వంసంపై ఐసిస్ అనుకూల మూకలు విషపు నవ్వులు చిందిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైశాచికానందం పొందుతున్నాయి. ఇలాంటి దాడులే మరిన్ని చోట్ల చేయాలంటూ ముష్కరులు కొందరు పోస్టులు పెట్టగా మోసుల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టు మరికొందరు పోస్టు చేశారు.

మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి 10:30 సమయంలో అమెరికా పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన వద్ద ఈ దాడి జరిగింది. సంగీత ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులు ఎరీనా ఆడిటోరియం నుంచి ఇళ్లకు బయల్దేరారు. అందరూ ఎంట్రన్స్ గేటువద్దకు చేరుకుంటుండగానే అదను చూసి మానవబాంబు తనను తాను పేల్చేసుకున్నట్టు భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు 19 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు అనంతరం కొద్దిపాటి తొక్కిసలాట జరగడంతో మరికొందరు గాయపడినట్టు భావిస్తున్నారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రదాడికి భీతిల్లిపోయి ఘటనా స్థలిలోనే చిక్కుకుపోయిన వారికి మాంచెస్టర్‌లోని గురుద్వారాలు ఆశ్రయం కల్పించాయి.

కాగా మాంచెస్టర్‌ పరిస్థితులను అత్యంత సునిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. మిలిటెంట్లు మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉండడంతో బ్రిటన్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. దాదాపు 21 వేల మంది కూర్చోగల సామర్థ్యమున్న ఈ ఆడిటోరియంలోకి ఉగ్రవాదులు అంత సులువుగా ప్రవేశించడంతో అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం సమయంలో ఎలాంటి భీతావహ పరిస్థితి నెలకొందో తెలుపుతూ కొందరు వీడియో ఫూటేజిలను యూట్యూబ్‌లో పెట్టారు. అనేకమంది సంగీత ప్రియులు అందునా చిన్నపిల్లలు భయంతో వేదిక అంతా పరుగులు పెట్టడం కనిపించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం భయం భయంగా వెదకడం కనిపించింది. తప్పిపోయిన పిల్లల కోసం పలువురు తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఫోటోలను పెడుతూ ఆచూకీ చెప్పాలని ప్రాథేయపడుతున్నారు.

మరోవైపు మాంచెస్టర్ దాడితో యూరోపియన్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రత కట్టుదిట్టం చేసి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే మాంచెస్టర్ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె ఎన్నికల పర్యటన రద్దు చేసుకుని ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

కుల్ భూషణ్ జాదవ్ చాలా సేఫ్ గా ఉన్నారని పాకిస్థాన్ ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం తుదు తీర్పు ఇచ్చేవరకూ జాదవ్ ప్రాణాలకు ముప్పులేదని పాకిస్థాన్ రాయబారి ఒకరు ప్రకటించారు.

ఐర్లండ్ ప్రధాని అయ్యేందుకు ఓ ఎన్ఆర్ఐ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నారు. భారతదేశ మూలాలున్న వ్యక్తి ఐర్లాండ్‌ ప్రధాని పీఠం దక్కించుకునేందుకు రెడీ అయ్యారు.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

తూర్పుగోదావరి జిల్లాలో పొలంలో రైతు దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన చుండ్రు రాఘవులు అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు....

మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్ల ఆగ్రహం

విశాఖ మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఏర్పా...

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇరువురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన షబ్బీర్ హుస్సేన్ కుటుంబం ఆసిఫా...

ఆలేరులో పాముకాటుకు బాలుడు బలి

యాదాద్రి జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. స్థానిక చింతలబస్తీకి చెందిన నితిన్ అనే బాలుడు పాముకాటుకు గురవ్వగా బాల...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేష‌న్

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధిం...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...