ఇస్లామాబాద్ కు బయలుదేరిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఈ విమానం 45 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందింది.ఇక పూర్తి వివరాలు తెలిసే వరకు వేచి ఉండాల్సిందే.

శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతమైంది. రిసోర్స్‌శాట్-2ఏను వాహకనౌక విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహకనౌక మొత్తం 17 నిమిషాల్లో వివిధ కక్ష్యలను దాటి ఉపగ్రహాన్ని 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రిసోర్స్‌శాట్ ఉపగ్రహ బరువు 1,235 కిలోలు. జలవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయ, రక్షణ రంగాలకు ఈ ప్రయోగం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందించనుంది.

ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌకను విజయవంతంగా నింగిలోకి పంపించింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు నుంచి నిరంతరాయంగా కొనసాగిన కౌంట్‌డౌన్‌ పూర్తికాగానే రిసోర్స్‌శాట్‌-2ఎ అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ36 రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. రాకెట్‌ నుంచి విడిపోయిన ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో చేరడంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు.

ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతో పాటు కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.48 సెకన్లకు మొదటి దశను పూర్తి చేసుకుంది. ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.9 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 521.7 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,028.26 సెకన్లకు నాలుగోదశను పూర్తి చేసుకుంది. అనంతరం నాలుగోదశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన 1,235 కిలోల బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ 1,075.26 (17.9 నిమిషాల్లో) సెకన్లకు భూమికి 827 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇంధనం బరువు తగ్గించి ఉపగ్రహాల బరువును పెంచేందుకు దోహదపడేలా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ16 ద్వారా రిసోర్స్‌శాట్-2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలకు అనుసంధానంగా 1,235 కిలోలు బరువు కలిగిన రిసోర్స్‌శాట్-2ఏ రోదసీలోకి పంపించారు. భూమిపై జలవనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణశాఖకు ఎంతో ఉపయోగకరంగా మూడు ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఈ ఉపగ్రహంలో త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం అమర్చి పంపించారు. ఇందులో లీనర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), (లిస్ -4) అనే రెండు  పేలోడ్స్‌తోపాటు అడ్వాన్‌‌స్‌డ్‌ వైడ్ ఫీల్డ్ సెన్సార్ పరికరాలను అమర్చి పంపించారు. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు ఒకచోటును స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోటును స్కానింగ్ చేయడానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి లోకేట్ చేస్తుంది. అంటే భూమిపై వనరుల విషయంలో అత్యుత్తమైన సేవలు అందిస్తాయి.

 ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం జర్మనీలో విధించనున్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో ఆదివారం రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపదాటికి భారీ నిర్మాణాలు సైతం నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి  వరకు 25 మంది మృతిచెందగా, వందకు మందికి పైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి:భూమా అఖిలప్రియ

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మ...

కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా

నేటి నుంచి రెండ్రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు తొలి రోజున కలెక్టర్లతో చర్చలు జరప...

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలోని ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా 16,500 కోట్...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

అహ్మదాబాద్ లో తొగాడియా అరెస్ట్ అంటూ హైడ్రామా

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా అదృశ్యమై ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిల...

గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం, కడప జిల్లాలో విషాదం

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-కర్నూలు జాతీయ రహదారి మలుపు వద్ద ప్రమాదం జ...

వనస్థలిపురంలో టిప్పర్ బీభత్సం

వనస్థలిపురంలో పీఎస్ పరిధిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. వాహనాలపైకి టిప్పర్ దూసుకురాగా... ఇద్దరు దుర్మరణం పాల...

నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ  దాడులు

నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

టాలీవుడ్ నిర్మాతలపై ఆదాయను పన్ను శాక దాడులు నిర్వహించారు. గత మూడేళ్ల కాలంలో పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టి తి...

ప‌ద్మావ‌త్' విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాత‌లు

ప‌ద్మావ‌త్' విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాత‌లు

ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాత‌లు. రాష్ట్రంలో కొన్ని వ‌ర్గాల ప్...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...