యాంకర్ వార్తలు చదవడం మొదలుపెట్టి ఏడ్చేసింది. తాను పనిచేస్తున్న టీవీ ఛానెల్‌ మూతపడిందని తెలిసి ఓ యాంకర్‌ ఏడుస్తూనే వార్తలు చదివింది. ఇజ్రాయిల్‌కి చెందిన ఛానెల్‌ 1 అనే వార్తా సంస్థలో గ్యులా ఈవెన్‌ అనే ఉద్యోగి యాంకర్‌గా పనిచేస్తున్నారు. ఛానెల్ వన్ న్యూస్ ఛానెల్ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్‌. ఈ ఛానెల్ కి  దాదాపు 49 ఏళ్ల చరిత్ర ఉంది. రాజకీయ వివాదాల కారణంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు ఈ ఛానెల్‌ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్యులా వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ విషయం ఆమెకి తెలిసింది. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది. నేతన్యాహు మీడియా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లానే వ్యవహరిస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఛానెల్ వన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్ అయ్యారు. నవాజ్ పై మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. కశ్మీర్‌లో జిహాదీని పెంచి పోషించేందుకు అల్‌ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. అవినీతిలో చిక్కుకున్న నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అస్థిరత పెంచేందుకు విదేశీయుల నుంచి షరీఫ్ నిధులు సేకరించిన ఆరోపణలపై పాకిస్థాన్ సుప్రీంకోర్టులో షరీఫ్‌పై కేసు వేయనున్నట్టు ఇమ్రాన్ పార్టీ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి తెలిపారు. తమ ఆరోపణలకు బలమైన సాక్ష్యాధారాలున్నాయని ఇమ్రాన్ పార్టీ పేర్కొంది. 

నిఘా కోసం నియమిస్తే ఆ విషయం మరిచిపోయి ఓ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది ఓ ఎఫ్‌బీఐ అధికారి. దీంతో అమెరికా ఎఫ్‌బీఐ ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఎఫ్‌బీఐ అధికారులు  వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ధ్రువపత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమెకు అత్యంత రహస్య భద్రత కూడా ఉంది. 

సాధారణంగా ఓ వ్యక్తి లేదా సంస్థపై రహస్య విచారణ జరపాల్సి వస్తే దానికోసం నియమించిన వ్యక్తి అత్యంత జాగ్రత్తగా ఆ పనిని పూర్తి చేస్తారు.  అంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన చోట సిరియాలో ఉగ్రవాదిపై రహస్య విచారణకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్‌ ఏకంగా అతడ్ని పెళ్లాడేసింది. జర్మనీకి చెందిన డేనియల్‌ గ్రీనీ అనే యువతి అమెరికాకు వలసవెళ్లి అక్కడ ఓ సైనికుడిని వివాహమాడింది. అనంతరం ఎఫ్‌బీఐ లో వ్యాఖ్యాతగా చేరింది. 2014 జనవరిలో ఐసిస్‌ ఉగ్రవాది డెనిస్‌ కస్పెర్ట్‌పై విచారణ నిర్వహించాల్సిందిగా గ్రీనీని ఎఫ్‌బీఐ నియమించింది. కస్పెర్ట్‌ జర్మనీకి చెందిన వ్యక్తి. అయితే  కస్పెర్ట్‌ సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరాడు. తల నరికిన, మృతదేహాలను చెప్పులతో కొట్టిన వీడియోలను చిత్రీకరించి అమెరికా అధ్యక్షుడి పంపి బెదిరించేందుకు యత్నించేవాడు.  

ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లిన గ్రీనీ కస్పెర్ట్‌కి సంబంధించిన కొన్ని ఫోన్‌ నెంబర్లు, స్కైప్‌ ఐడీలను సంపాదించింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐకి చెప్పకుండా ఉగ్రవాదితో రహస్యంగా సంభాషణలు సాగించేది. ఆరు నెలల తరువాత ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పి జర్మనీకి వెళ్లి గ్రీనీ తన కుటుంబసభ్యులతో మాట్లాడింది. ఆ తరువాత నేరుగా మళ్లీ సిరియా వెళ్లి కస్పెర్ట్‌ను వివాహం చేసుకుంది. అప్పటికే అమెరికా  సైనికుడితో  పెళ్లి అయిందన్న విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. పెళ్లాడిన నెలరోజుల్లోనే తప్పు చేశానని భావించి కస్పెర్ట్‌ నుంచి తప్పించుకుని మళ్లీ అమెరికాకు వెళ్లిపోయింది.ఎట్టకేలకు తన తప్పు తెలుసుకుని పోలీసులకు సహకరించింది గ్రీనీ.గ్రీనీని విచారించిన ఎఫ్‌బీఐ ఆమె అన్ని నిజాలు చెప్పడంతో రెండేళ్ల జైలు శిక్ష వేశారు.

సాహసమే ఊపిరిగా సాగుతున్న ఓ వ్యక్తికి అరుదైన ఆసక్తి ఉంటే ఏమవుతుంది. అబ్బో ఇంకేమవుతుంది. కళ్లు చెదిరే, ఒళ్లు జలదరించే ఫీట్ అవుతుంది అంతే. మరి అదే జరిగింది ఇక్కడ కూడా.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...