Trump meeting with kim

ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీపై శ్వేతసౌధం తొలిసారిగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Modi singapore visit

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. సింగపూర్ అధ్యక్షుడు

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నాయి. మానవాళి హడలిపోయేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ ప్రాణభయం వెంటాడుతోంది. భారత్ లోనూ అడుగుపెట్టిన నిఫా ఇప్పటికే తానేంటో చూపిస్తోంది. ప్రభుత్వాలను గడగడలాడిస్తోంది.

ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధుల్లో తొలి పదింటిలో నిఫా వైరల్‌ ఫీవర్‌ ఒకటి. ఈ మాట ఎవరో అన్నది కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు. అందుకే అందరిలోనూ అంతగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర దేశాల్లో ప్రాణాలు తీస్తున్న ఎబోలా, జికా వైరస్‌లకన్నా ఇది ప్రమాదకారిగా మారిపోయింది. ఆసియా దేశాలను బెంబేలెత్తించిన బర్డ్ ఫ్లూ కన్నా మిన్నగా మారిపోయింది. ఒక జాతి గబ్బిలాలు దీనికి ప్రధాన కారణం. ఇక పందులు, ఈ వైరల్‌ ఫీవర్‌ సోకిన రోగుల ద్వారా కూడా ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు నిఫా రాకుండా నివారించే వాక్సిన్‌గాని, రోగాన్ని తగ్గించే మందులు కానీ పుట్టలేదు. కేవలం ఉపశమనం కలిగించే చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీంతో నిఫా సోకితే మరణం తప్ప మరోటి లేకుండా పోతోంది. 

కేరళపై నిఫా వైరస్‌ పంజా విసిరింది. ఆ వ్యాధి బారిన పడి రెండంకెల మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఇదే విషయం దేశ విదేశాల్లో ఆందోళనకు కారణమవుతోంది. తొలుత 1998లో మలేషియాలో ఈ వైరస్‌ బయటపడింది. సుంగాయ్ నిఫా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా దీన్ని కనుగొన్నారు. అందుకే దీనికి నిఫా వైరస్‌ అన్న పేరు వచ్చింది. నిఫాతో మలేషియా అదే ఏడు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి సింగపూర్‌లో వెలుగు చూసింది. అక్కడ పందులు పెంచే వారు నిఫా బారిన పడ్డారు. ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి తన ఉనికి చాటుకుంది. అక్కడే తిష్ట వేసింది కూడా. ప్రతి ఏటా శీతాకాలంలో బంగ్లాదేశ్ ను నిఫా వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తోంది. 

బంగ్లాదేశ్ నుంచి భారత్ లోని కేరళకు నిఫా ప్రవేశించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది. గుర్తు పట్టే లోగానే పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. 50 మంది వరకు దీని బారిన పడ్డట్లు ప్రాథమికంగా గుర్తించారు వారిలో 25 మందికిపైగా వ్యాధికి గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడా నిఫా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదం. అంచనాకు అందనంత వేగంగా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం డటం వల్ల ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉండబోతోందన్న హెచ్చరికలు అందరినీ హైరానాకు గురి చేస్తున్నాయి. 

కోజికోడ్‌లో విజృంభించిన ప్రాణాంతక వైరస్ ఇన్‌ఫెక్షన్ ను నియంత్రించడం ప్రజారోగ్య విపత్తుల పట్ల భారత్ స్పందనా సామర్థ్యానికి ఒక పరీక్షలా మారిపోయింది. ఆరోగ్య సంరక్షణ, నాణ్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల జాబితాలో 2016లో భారత్ 145 స్థానంలో ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ తరుణంలో నిఫా మహమ్మారిని నిర్మూలించడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాదీ నిఫా మరణాలు సంభవి స్తున్నప్పటికీ, సుదూరంగా ఉండే కేరళలో ఆ మహమ్మారి ఇంతలా విజృంభిస్తుందని దాదా పు ఎవరూ ఊహించలేదు. కేరళ నుంచి విశాఖ, హైదరాబాద్‌లకు నిత్యం విమానాలు, రైళ్ల ద్వారా వేలాది మంది వచ్చి వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాలు కూడా సత్వరం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

modi meeting with russia

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన

కేసీఆర్ చిన్న మోడీ

సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరా...

డీఎంకెలో దుమారం

డీఎంకెలో దుమారం

డీఎంకె అధినేత కరుణానిధి మృతి తర్వాత ఆ పార్టీ అధ్యక్షునిగా స్టాలిన్‌ను ఎన్నుకుంటారని తమిళ రాజకీయాల్లో ప్రచారం జ...

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతు...

గిరిజనులకు చంద్రబాబు వరాలు

విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారి...

వెంటనే తెలంగాణకి ఏజీని నియమించండి

తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రె...

రైతుభీమా పత్రాలను అంద చేసిన మంత్రి

ప్రభుత్వం అందిస్తున్న రైతు భీమా పథకాన్ని రాష్ట్రంలోని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మంత్రి అల్లోల...

పాక్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం వాయిదా పడ్డట్టేనా..?

పాకిస్థాన్ కొత్త ప్రధానిగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు క...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

పోలీసులకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీస్ పథకాలను ప్రకటించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శా...

హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ తనిఖీలు

హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర చర్యలకు పాల్పడే అవకాశముందన్న నిఘా విభాగం సమాచారం ఇచ్చిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐకియా హోం ఫర్నిషింగ్ సంస్థ భారత దేశంలో తన మొదటి స్టోర్‌ను హైటెక్స్‌లో తెలంగాణ ఐ...