భారత పాక్ సరిహద్దుల్లో ఆవరించిన యుద్ధమేఘాలు. మనదేశం తీరుతో షాక్ తిన్న పాక్ సియాచిన్ గ్లేసియర్ పైకి యుద్ధ విమానాలను పంపింది. షియాచిన్ మంచు పర్వతాలపైకి దాయాది దేశానికి చెందిన ఫైటర్ జెట్లు దూసుకువచ్చాయి. దాంతో మనదేశ సైన్యం అప్రమత్తమైంది. దీంతో మరోమారు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఈనెల 20, 21 తేదీల్లో మనదేశం సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్థాన్ సైనిక శిబిరాలపై దాడిచేసిన నేపథ్యంతో తాజాగా పాకిస్థాన్ చెలరేగిపోతున్నట్టు సమాచారం. 

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ప్రముఖ మోడల్ మెలానియా ట్రంప్ తన భర్త ట్రంప్ తో చాలా చిరాకుగా ఉంటున్నట్టు బాహాటంగానే కనిపిస్తోంది. కలసి ప్రయాణాలు చేస్తున్నా ఆమెలో మునుపటిలో ఉన్న హుషారుమాత్రం కనిపించడంలేదు. ఎందుకో ఆమె ట్రంప్ పై ఏమాత్రం ఆసక్తి చూపుతున్నట్టు లేదు. ఇజ్రాయెల్ పర్యటనలో ఇలా ఆమె అధ్యక్షుడి చేయిని విదిలించుకున్న తీరు ఇప్పుడు బాగా వైరల్ వీడియాగా మారింది.

ఇంగ్లండ్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఉగ్రమూక ఐసిస్ ప్రకటించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని భీకరదాడులు చేస్తామని పేర్కొంది. మరోవైపు మాంచెస్టర్‌లో జరిగిన విధ్వంసంపై ఐసిస్ అనుకూల మూకలు విషపు నవ్వులు చిందిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైశాచికానందం పొందుతున్నాయి. ఇలాంటి దాడులే మరిన్ని చోట్ల చేయాలంటూ ముష్కరులు కొందరు పోస్టులు పెట్టగా మోసుల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టు మరికొందరు పోస్టు చేశారు.

మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి 10:30 సమయంలో అమెరికా పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన వద్ద ఈ దాడి జరిగింది. సంగీత ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులు ఎరీనా ఆడిటోరియం నుంచి ఇళ్లకు బయల్దేరారు. అందరూ ఎంట్రన్స్ గేటువద్దకు చేరుకుంటుండగానే అదను చూసి మానవబాంబు తనను తాను పేల్చేసుకున్నట్టు భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు 19 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. పేలుడు అనంతరం కొద్దిపాటి తొక్కిసలాట జరగడంతో మరికొందరు గాయపడినట్టు భావిస్తున్నారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఉగ్రదాడికి భీతిల్లిపోయి ఘటనా స్థలిలోనే చిక్కుకుపోయిన వారికి మాంచెస్టర్‌లోని గురుద్వారాలు ఆశ్రయం కల్పించాయి.

కాగా మాంచెస్టర్‌ పరిస్థితులను అత్యంత సునిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. మిలిటెంట్లు మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉండడంతో బ్రిటన్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. దాదాపు 21 వేల మంది కూర్చోగల సామర్థ్యమున్న ఈ ఆడిటోరియంలోకి ఉగ్రవాదులు అంత సులువుగా ప్రవేశించడంతో అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం సమయంలో ఎలాంటి భీతావహ పరిస్థితి నెలకొందో తెలుపుతూ కొందరు వీడియో ఫూటేజిలను యూట్యూబ్‌లో పెట్టారు. అనేకమంది సంగీత ప్రియులు అందునా చిన్నపిల్లలు భయంతో వేదిక అంతా పరుగులు పెట్టడం కనిపించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం భయం భయంగా వెదకడం కనిపించింది. తప్పిపోయిన పిల్లల కోసం పలువురు తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఫోటోలను పెడుతూ ఆచూకీ చెప్పాలని ప్రాథేయపడుతున్నారు.

మరోవైపు మాంచెస్టర్ దాడితో యూరోపియన్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రత కట్టుదిట్టం చేసి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే మాంచెస్టర్ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె ఎన్నికల పర్యటన రద్దు చేసుకుని ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

కుల్ భూషణ్ జాదవ్ చాలా సేఫ్ గా ఉన్నారని పాకిస్థాన్ ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం తుదు తీర్పు ఇచ్చేవరకూ జాదవ్ ప్రాణాలకు ముప్పులేదని పాకిస్థాన్ రాయబారి ఒకరు ప్రకటించారు.

హత్యా రాజకీయాలు చేయటం వైఎస్ కుటుంబానికి అలవాటే అని విమర్శించిన టీడీపీ

హత్యారాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైఎస్ కుటుంబానికి అలవాటేనని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు రె...

రాజకీయ హత్యలపై టీడీపీ స్పందించటంలేదు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినవాళ్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం రాజకీయ...

అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు జీవిత ఖైదు

విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటర్రావుకు జీవిత ఖైద...

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న వామపక్షాల బంద్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ కు ప్రజలు సహకరించడంతో జనజీవ...

హిమగిరిపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు అడ్వెంచ‌ర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మ‌రోసారి సిద్దమ‌వుతో...

నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న అమిత్ షా

నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో పర్యటిస్తున్నారు అమిత్ షా. గుండ్రాంపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడి...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

చార్ ధామ్ యాత్రలో విషాదం.. నదిలో మునిగి వ్యక్తి మృతి

పవిత్ర చార్ ధామ్ యాత్ర విషాదంగా మారింది. కడప నగరానికి చెందిన నారాయణ రెడ్డి తీర్థయాత్రలకు వెళ్లారు. అందులో భాగం...

త్వరలోనే ప్రధానిని కలవనున్న రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందన...

హైదరాబాద్ లో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ పోలీసు...

బీటెక్ విద్యార్థినిపై నలుగురు సీనియర్ల అత్యాచారయత్నం

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మేడిపల్లిలో బీటెక్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు అత్యాచారయత్నం చేశారు. వీరంతా...

అభిమానులకి షాక్ ఇచ్చిన సింగర్ సోనూనిగమ్

అభిమానులకి షాక్ ఇచ్చిన సింగర్ సోనూనిగమ్

బాలీవుడ్ సింగర్లు సంచలనాలకు కేంద్ర బిందువులవ్వడం ఫ్యాషన్ గా మారింది. ట్విట్టర్లో తమకున్న మిలియన్లమంది ఫాలోయర్ల...

చలపతిరావు వాఖ్యలపై స్పందించిన నాగార్జున

చలపతిరావు వాఖ్యలపై స్పందించిన నాగార్జున

తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...