రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ మహిళా బాక్సర్ మంజు రాణి ఓడిపోయింది. సెమీ ఫైనల్లో రాణి థాయ్‌లాండ్‌కు చెందిన చుతామట్
రాక్సాట్పై 4-1తో బౌట్ గెలిచి ఫైనల్‌కు చేరిన రాణి ఫైనల్స్ లో రష్యాకు చెందిన ప్రపంచ రెండో సీడ్ ఏకటేరినా పాల్ట్సేవా చేతిలో 4-1తో ఓటమి పాలైంది. దీంతో ఆమె సిల్వర్ మెడల్‌తోనే సరిపెట్టుకుంది. కాగా... ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల వయస్సులోనే ఫైనల్స్‌లో ప్రవేశించిన మొదటి ఉమెన్ గా మంజురాణి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.