Print
Hits: 127

మాంచెస్టర్: భారత్ vs న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ లో భారత్‌ ఆదిలోనే ఆత్మరక్షణలో పడింది. 5 పరుగులకే భారత టాప్ ఆర్డర్ పెవిలియన్ క్యూ కట్టారు. ఓపెనర్లు

రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ సహా.. భారత సారధి విరాట్ కోహ్లీ కూడా ఒక పరుగు మాత్రమే చేసి ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్న హిట్ మాన్ రోహిత్, హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కోహ్లీ.. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, ఆ వెంటనే లోకేశ్ రాహుల్ సైతం హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఈ ముగ్గురు ఒక పరుగు చేసి ఔటవ్వడం విశేషం. బంతి విపరీతంగా స్వింగ్ అవుతుండడం కివీస్‌ బౌలర్లకు బాగా కలిసి వస్తోంది. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.

e-max.it: your social media marketing partner