rcb new captain

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సీజన్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతూ... కొన్ని సార్లు

ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేక అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అటు టీమ్ లైనప్ ఎంత దుర్భేద్యంగా ఉన్నప్పటికీ మొత్తం 11 సీజన్లలో కలిపి రెండు సార్లు ఫైనల్ చేరినప్పటికీ ఆ రెండు సార్లు హైదరాబాదు జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో 2019 ఐపీఎల్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఆ జట్టు కోచ్‌ డానియల్‌ వెటోరీ స్థానంలో గ్యారీ కిర్‌స్టన్‌కు బాధ్యతలు అప్పగించగా, తాజాగా 2019 ఐపీఎల్‌లో ఆర్సీబి జట్టుకు విరాట్‌ కోహ్లీ స్థానంలో మిస్టర్‌ 360, ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2013 నుంచి ఆర్సీబికి కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా, టీమిండియాను విజయపథంలో నడిపినట్లు ఆర్సీబికి మాత్రం విజయాలు అందించలేకపోతున్నాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం టీమ్ పగ్గాలు డివిలియర్స్‌కు అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌ ఐపీఎల్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఏప్రిల్ నెలలో ఎన్నికల దృష్ట్యా కాస్త ముందుగానే టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి 2019 ఐపీఎల్‌ .... మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనున్నట్లు సమాచారం.

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

తుఫాను నష్ట తీవ్రతను తగ్గించాం

కాకినాడ: ముందు జాగ్రత్త చర్యలతో పెథాయ్‌ తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు సీఎం చంద్రబాబు. ఐవీఆర్‌ఎస్‌,...

రామ్మోహన నాయుడు ఒక్కరోజు దీక్షకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వేదికగా ఏపీ రాష్ట్ర హక్కుల కోసం పుట్టిన రోజున కూడా పోరాడుతోన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరా...

రేపు ఓటు జాబితాను సవరిస్తాం : పల్లా రాజేశ్వర్ 

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పల్లా

కేసీఆర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా

బిడ్డకు విడుదల...

పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ జైలు నుంచి రేపు...

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా ఐఏఎస్ పై ఎమ్మెల్యే ఫైర్...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె ఒక మహిళా అధికారిణి పైగా...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఓడిన భారత్

పెర్త్ టెస్ట్ లో భారత్ జట్టు ఓటమిపాలయ్యింది. రెండో ఇన్నింగ్స్

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...