భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి పాలయ్యాడు.
ఫైనల్లో మ్యాచ్ లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిడాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు. తొలి గేమ్‌లో హోరాహోరాగా పోరాడి నెగ్గిన భారత షట్లర్ శ్రీకాంత్ ఆపై రెండు వరుస గేమ్‌లు కోల్పోయాడు. దీంతో మ్యాచ్ లీ చోంగ్ వీ వశమైంది. దీంతో శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.