తుది సమరానికి వేళైంది. చరిత్ర పుస్తకాలను తిరగరాసేందుకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ విద్యార్థులు సిద్ధమయ్యారు.
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని రికార్డు స్థాయిలో నాలుగోసారి అందుకోవాలని పృథ్వీషా నేతృత్వంలోని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వవిజేతలుగా నిలవాలని పట్టుదలతో ఉంది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత్ అంతిమ సమరంలో గెలవాలని ఆకాంక్షిస్తోంది. మరోవైపు క్వార్టర్లో ఓటమి అంచుల దాకా వెళ్లి పుంజుకొని ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆసీస్ టీమిండియాకు కఠిన సవాల్ విసరాలని యోచిస్తోంది. గ్రూప్ దశ పోరులో 100 పరుగుల తేడాతో చిత్తుచేసిన భారత్‌ను దెబ్బకొట్టాలని భావిస్తోంది. నేడు న్యూజిలాండ్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.