కొన్నాళ్ల క్రితం వరకు సాంప్రదాయ టెస్టులు మినహా వన్డేల్లో ఈ టీమ్‌ అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే గత రెండేళ్లలో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతో ప్రపంచంలో ఏ వేదికలోనైనా వన్డేల్లో భారీ స్కోర్లు సాధిస్తున్న ఇంగ్లండ్‌ బలమైన జట్టుగా ఎదిగింది. తమ వన్డే చరిత్రలో అత్యుత్తమ దశలో ఉన్న ఇంగ్లండ్‌ సొంతగడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీలో ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇంగ్లండ్‌లోనే జరిగిన రెండు చాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ ఫైనల్లో ఓడిన ఆ జట్టు ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది.

ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు తాజా ఫామ్‌ ఏ ప్రత్యర్థికైనా దడ పుట్టించేలా ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన ప్రత్యర్థితో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సాధించిన అలవోక విజయం దానిని మళ్లీ నిరూపించింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యం గల ఆటగాళ్లతో పాటు సొంతగడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుండటం ఆ జట్టుకు అదనంగా అనుకూలించే అంశం. ముఖ్యంగా మోర్గాన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వన్డే టీమ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఏకంగా తొమ్మిదో స్థానం వరకు ఎలాంటి తత్తరపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగల లైనప్‌ ఇంగ్లండ్‌ సొంతం. తమకు అనుకూలించే వాతావరణ పరిస్థితుల్లో స్వింగ్‌తో చెలరేగిపోగల బౌలర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ఇవన్నీ ఇతర జట్లకంటే ఆతిథ్య జట్టును అందరికంటే ముందు నిలబెడుతున్నాయి.

చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ రెండు సార్లు ఫైనల్‌ చేరింది. 2004లో వెస్టిండీస్‌ చేతిలో ఆ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 217 పరుగులు చేసిన ఇంగ్లండ్‌.. విండీస్‌ను 147/8 వద్ద కట్టడి చేసి విజయాన్ని ఆశించింది. కానీ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రౌన్, బ్రాడ్‌షా 71 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ కథ ముగించారు. గత టోర్నీలో భారత్‌ చేతిలోనే ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చేతిలో ఆరు వికెట్లతో 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్‌ ఓటమి దిశగా నడిచింది. ఓవరాల్‌గా చాంపియన్స్‌ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ టీమ్‌ 11 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓడింది.

ఓపెనర్లు జేసన్‌ రాయ్, హేల్స్‌ జోడి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తోంది. ప్రతీసారి వీరు అందిస్తున్న శుభారంభమే ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేస్తోంది. నిలకడకు మారు పేరైన జో రూట్‌తో పాటు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్, బెన్‌ స్టోక్స్‌లతో జట్టు మిడిలార్డర్‌ కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ఇంగ్లండ్‌ జట్టుకు వరంలా మారింది. ప్రపంచంలోనే ఇప్పుడు మేటి ఆల్‌రౌండర్‌గా ఉన్న స్టోక్స్, ఇటీవల ఐపీఎల్‌లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్లకు కష్టాలు తప్పవు. మోకాలి గాయం నుంచి కోలుకొని అతను పూర్తి ఫిట్‌గా మారడం ఆ జట్టు ఆందోళనను దూరం చేసింది. మొయిన్‌ అలీ కూడా ఆల్‌రౌండర్‌గా చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై వోక్స్, వుడ్, ప్లంకెట్‌లాంటి పేసర్లు సరిగ్గా సరిపోతారు.

లీగ్‌ దశలో జూన్‌ 1న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడాల్సి ఉన్నా ఇంగ్లండ్‌ గడ్డపై ఇటీవల ఆస్ట్రేలియాకు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి మోర్గాన్‌ సేన సెమీస్‌ అడుగు ఖాయంగా వేసినట్లే. ఇంగ్లండును సొంతగడ్డపై ఎదుర్కోవడం కష్టమే అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా ఇంగ్లండుకే ఉందని  వెస్టిండీస్ లెజెండ్రీ క్రికెటర్ బ్రియాన్ లారా విశ్లేషించాడు. 

e-max.it: your social media marketing partner

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కష్టాలు రోగులను...

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక టీడీపీ కార్యకర్త మృతి...

జీఎస్టీకి నిరసనగా రోడ్డెక్కిన ఖమ్మంలోని వ్యాపారులు

గ్రానైట్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28శాతం జీఎస్టీకి నిరసనగా ఖమ్మంలో వ్యాపారులు రోడ్డెక్కారు. కేంద్రం...

నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనపరచిన జగిత్యాల జిల్లా విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి అలేఖ్య అనే విద్యార్థిని నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి మ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మ‌రోసారి భారత్ ఫై పాక్ దాడి

భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధ...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...