ధోనీ కంటే నేనేం తక్కువ ధోనీ కంటే నేనే సీనియర్ ను ఐపీఎల్లో ఆడని అశ్విన్ కు చోటా ఐపీఎల్లో రాణించిన గంభీర్ ను మాత్రం పట్టించుకోరా వరుస ప్రశ్నలతో టర్భోనేటర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ సెలక్షన్ కమిటి మీద ఫైర్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తనను పరిగణలోకి తీసుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు.  జట్టుకు ఎంపికైన ధోని కంటే తానేం తక్కువా జట్టులో ఎంపికలో ధోనీకి విశేష ప్రాధాన్యమిస్తున్న సెలక్టర్లు తనను మాత్రం విస్మరిస్తున్నారని వాపోయాడు.

చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందని తొలుత ఆశించినట్లు చెప్పిన  భజ్జీ...టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి స్థానం కల్పించడాన్ని పరోక్షంగా తప్పుబట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో ధోనికి స్థానం కల్పించి తనకు ఎందుకు చోటు కల్పించలేదో అర్ధం కాలేదన్నాడు. దాదాపు ఎప్పుడ్నుంచో క్రికెట్ ఆడుతున్న తనకు కనీసం ధోనికి ఇచ్చిన ప్రాధాన్యతను ఇచ్చి ఉంటే సంతోషించే వాడినని ఎట్టకేలకు మనసులోని బాధను వెల్లడించాడు. ఇక్కడ ధోని కథ వేరు తన కథ వేరుగా అభివర్ణించిన భజ్జీ.. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు సెలక్షన్ నిజాయితీగా జరిగిందని తాను అనుకోవడం లేదన్నాడు.

ధోని బ్యాటింగ్ లో కీలకం. అందులో ఎటువంటి సందేహం లేదు. ధోని ఫామ్ లో ఉన్నా, లేకపోయినా జట్టులో ఎంపిక చేయడానికి కారణం అతని అనుభవం. గత కొంతకాలంగా ధోని పెద్దగా బంతిని హిట్ చేయడం లేదు. అది మనం చూస్తునే ఉన్నాం. అయితే అతను మాజీ సారథి కావడంతో పాటు పరిస్థితుల్ని అర్ధం చేసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నవాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ లో యువ క్రికెటర్లకు ధోని అనుభవం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 

ఇక నా వరకూ వస్తే ధోనికిచ్చిన ప్రాముఖ్యత నాకివ్వలేనందుకు బాధగా ఉంది. మేము కూడా 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాం. టీమిండియా గెలుపుల్లో, ఓటముల్లో భాగస్వామ్యులమవుతునే వస్తున్నాం'అని గౌతం గంభీర్ ను ఎంపిక చేయకపోవడాన్ని కూడా హర్భజన్ సింగ్ ఇక్కడ ప్రస్తావించాడు. 'నేను రెండు వరల్డ్ కప్ లకు ప్రాతినిథ్యం వహించా. అవేవి పట్టించుకోలేదు. కొంతమందికి మాత్రమే ఈ తరహా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇలా ప్రాముఖ్యత దక్కని ఆటగాళ్లలో నేను కూడా ఒకడ్ని'అని భజ్జీ తన స్వరాన్ని పెంచుతూ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. కచ్చితంగా సెలక్షన్ అనేది నిజాయితీగా జరగలేదని తాను అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. 

ఇప్పటికీ తాము ఐపీఎల్ వంటి టోర్నీలు ఆడటానికి కారణం టీమిండియా జట్టులో చోటును ఆశించి మాత్రమేనని అన్నాడు. ఐపీఎల్లో గౌతం గంభీర్ నిలకడగా రాణించినా అతన్ని ఎందుకు పక్కన పెటారని భజ్జీ నిలదీశాడు.. మరొకవైపు ఐపీఎల్ -10 సీజన్ లో అస్సలు పాల్గొనని రవి చంద్రన్ అశ్విన్ ను చాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. వేర్వేరు ప్రజలకు వేర్వేరు నిబంధనలు ఏమిటో తనకు అర్థం కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు హర్భజన్.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లోకి రేవంత్ చేరికపై మీడియాలో పుకార్లు

కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తు...

సీపీయం పార్టీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు

సీపీయం పార్టీపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేరళలో హత్యా రాజకీయాలను సీఎం విజయన్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ పార...

కాకినాడలో నిర్వహించిన అమరవీరుల స్మారక దినోత్సవం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రా...

పెరిగిన వంశధార నదికి వరద ఉధృతి

శ్రీకాకుళం జిల్లా వాసులకు వాయుగండం తప్పిందన్న ఆనందం కంటే వరదముప్పు తప్పలేదని బెంబేలు ఎక్కువయింది. నిన్నరాత్రి...

గ్రామాల్లో వైభవంగా కొనసాగుతున్న జడకొప్పులాట

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగలో భాగంగా జడకొప్పులాట కోలాహల సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప...

పని చేసిన డబ్బులు చెల్లించడం లేదని తోటి కాంట్రాక్టర్ కిడ్నాప్

కాంట్రాక్ట్‌ పని చేసిన డబ్బులు చెల్లించడం లేదనే నేపంతో తోటి కాంట్రాక్టర్‌ను సినీ ఫక్కీలో అపహరించి బెదిరించి, క...

సింగపూర్‌లో అమరావతికి భూములిచ్చిన రైతుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలౌతున్న వివిధ అభివృద్ధి పథకాలను...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

గబ్బిలాలు కోసం బాణసంచా నిషేధం

తమిళనాడు సేలం జిల్లాలోని ఒవ్వాల్ తోప్పు గ్రామంలో ప్రజలు దీపావళి పండుగను ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో జరుపుకున...

ముస్లింలకు ఫత్వా జారీ

తమ ఫొటోలు లేదా తమ కుటుంబసభ్యుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని దారుల్ ఉలూమ్ దియోబంద్ నిషేధించింది. ఉత్...

యామాపూర్ మాజీ సర్పంచ్ పై కాల్పులు జరిగిన దుండగులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజన్నపై అర్థరాత్రి దుండగులు కాల్పు...

కడపజిల్లాలో దారుణహత్య...

కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో దారుణహత్య జరిగింది. ఇంట్లో నిద్రపోతున్న గంగయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియన...

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది...

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీర...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

జీఎస్టీ పరిధిలోకి రానున్న రియల్ ఎస్టేట్

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ త...

నేడు, రేపు షీలాభిడే కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తొమ్మిదో షెడ్యూల్ లోని ప్రభుత్వ రంగసంస్థల విభజనపై ఇవాళ, రేపు షీలాభిడే నాయకత్వంలోని...