బీసీసీఐ మళ్లీ కోచ్‌ వేటలో పడింది. ఛాంపియన్స్‌ ట్రోఫీతో ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఏడాది పదవీ కాలం ముగియనుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. విజయవంతమైన కోచ్‌ కుంబ్లేను కొనసాగించకుండా బోర్డు మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకుంటోంది. ఆటగాళ్ల జీతాలతో పాటు చాలా అంశాల్లో కుంబ్లే వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బోర్డు అధికారులు కావాలనే ఇలా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కోచ్‌గా వ్యవహరించిన కాలంలో స్వదేశంలో భారత్‌ ఆడిన 13 టెస్టుల్లో 10 విజయాలు, ఒకటే పరాజయం. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ విజయంతో పాటు వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన. అయితే ఇవేవీ కూడా అనిల్‌ కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేందుకు సరిపోలేదు. చాంపియన్స్‌ ట్రోఫీతో కుంబ్లే ఏడాది పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత కోచ్‌ హోదాలో మళ్లీ తన బయోడేటాను పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటర్వూ్యకు హాజరయ్యే వెసులుబాటు మాత్రం కుంబ్లేకు బోర్డు కల్పించింది.

ఆసక్తి కలిగిన వారు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాల్సిఉండగా, వీరిని క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులైన సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇంటర్వూ్య చేస్తారు. ‘ఈ ఎంపిక వ్యవహారం పూర్తి పారదర్శకంగా ఉండేందుకు పరిపాలక కమిటీ (సీఓఏ)కి చెందిన నామినీ పర్యవేక్షకులుగా ఉంటారు. కుంబ్లే పనితీరు బాగానే ఉంది. అయితే వచ్చే నెల 20న ఆయనతో ఒప్పంద గడువు ముగుస్తుంది. ఆ తర్వాత సహజంగా జరగాల్సిన ప్రక్రియే ఇదంతా. కుంబ్లే కూడా మరోసారి ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీసీఐలోని ఏ ఒక్కరి నిర్ణయం వల్లో కోచ్‌ ఎంపిక జరగదు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌ ఎంపిక చేస్తారు’ అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.

నిజానికి మైదానంలో జట్టు ప్రదర్శన బాగున్నా ఇతర కారణాలు కుంబ్లేను ఆటోమెటిక్‌గా కొనసాగించేందుకు అడ్డు పడుతున్నాయి. కుంబ్లే వ్యవహార శైలిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల వేతనాలతో పాటు తన వేతనాన్ని కూడా భారీగా పెంచాలనే విషయంలో ఈ దిగ్గజ స్పిన్నర్‌ దూకుడుగా వెళ్లడం బోర్డుకు రుచించలేదు. ఈ కారణంగానే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు అటు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టగానే ఇటు కొత్త కోచ్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరుతోంది. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్లు ఇస్తుండగా దీన్ని రూ.5 కోట్లకు పెంచాలని అలాగే కోచ్‌ వేతనం రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచాలని కుంబ్లే సూచించారు.

కుంబ్లే  ఆటగాళ్ల కోసమే కాకుండా తన కోసం కూడా బేరమాడుతున్నాడు. ఆయన చేస్తున్న డిమాండ్లు చాలా క్లిష్టంగా ఉన్నాయి. విరాట్‌ కోహ్లి కోసం 25 శాతం అదనంగా ‘కెప్టెన్సీ ఫీజు’ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నాడు. అంతేకాకుండా సెలక్షన్‌ కమిటీలో కెప్టెన్, కోచ్‌లకు కూడా సమానస్థాయిలో హోదా, ఓటింగ్‌ హక్కు కావాలంటున్నాడు. ఇవన్నీ ఆయనకు సంబంధం లేని విషయాలు’ అని బోర్డుకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే కుంబ్లే సూచనల్లో చాలా వాటిని అమలు చేసేందుకు బోర్డు ఇష్టపడడం లేదు. బీసీసీఐ ఆదాయంనుంచి ఆటగాళ్లకు ఇస్తున్న 26 శాతం మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.  

e-max.it: your social media marketing partner

మోహన్ బాబుపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సినీనటుడు మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జి...

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మహిళల మృతదేహాల లభ్యం

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. బుట్టయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం సమీపంలో ఇద...

కడప జిల్లాలో పిచ్చికుక్కుల స్వైర విహారం.. 12మందిపై దాడి

కడప జిల్లా రాజంపేట పట్టణంలో పిచ్చి కుక్కులు స్వైర విహారం చేశాయి. ఏకంగా 12మందిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయప...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

రెండు క్రూడ్‌ బాంబులను స్వాధీనం చేసుకున్న బీహార్‌ పోలీసులు

పాట్నా: భారీ ఉగ్ర కుట్రను బీహార్‌ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్‌(బుద్ధ) గయలో మరో మారణహోమం జరగకుండా ని...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

శామీర్‌పేట్‌ లో దారుణ సంఘటన....

వివాహేతర సంబంధాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ...

కామాంధుడి చేతిలో మోసపోయిన మైనర్ బాలిక

ప్రేమించమని వెంటపడ్డాడు. డబ్బు నగలు ఆశచూపి వశబరుచుకున్నాడు. అమ్మవారి సన్నిధిలో మెడలో గొలుసు వేసి ఇదే పెళ్లన్నా...

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

వివాదాస్పద 'పద్మావత్' చిత్రానికి ఇచ్చిన సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని కోరుతూ శుక్రవారం దాఖలైన మరో పిట...

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...