గత చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన జట్టుతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మరింత మెరుగుపడ్డామని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తొలి ఐసీసీ టోర్నీలో ఆడబోతుండటం ఉద్వేగాన్నిస్తోందని అన్నాడు. 2013లో ధోని కెప్టెన్సీలో విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగబోతోంది. 

గత చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన జట్టుతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మరింత మెరుగుపడ్డామని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తొలి ఐసీసీ టోర్నీలో ఆడబోతుండటం ఉద్వేగాన్నిస్తోందని అన్నాడు. క్రితంసారి మా పేసర్లు, స్పిన్నర్లు, ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో కప్‌ గెలుచుకున్నాం. అయితే నాలుగేళ్ల క్రితంనాటి యువ జట్టుతో పోలిస్తే ఇప్పుడు మా ఆటగాళ్లలో మరింతగా అనుభవం పెరిగింది. అన్ని విభాగాల్లోనూ పరిణతి సాధించడంతో పాటు మరింత ఫిట్‌గా మారారు. ఇంగ్లండ్‌లో బ్యాట్స్‌మెన్‌కు కఠిన సవాళ్లు ఎదురవుతాయి. దీనిని ఎదుర్కోవడానికి మేం సిద్ధం. మా జట్టులో మంచి పేసర్లతోపాటు సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ వారి వల్లే గెలవగలిగాం’ అని 28 ఏళ్ల విరాట్‌ కోహ్లి వివరించాడు.

స్వదేశంలో సుదీర్ఘ టెస్టు సిరీస్, ఐపీఎల్ తర్వాత వన్డే ఫార్మాట్ ఆడుతున్నాం కాబట్టి ఫిట్‌నెస్‌తో ఉండటం చాలా ముఖ్యమని కోహ్లీ అంగీకరించాడు. శరీరాన్ని కాపాడుకోవడం అతిపెద్ద పెద్ద సవాలు. మానసికంగా ఉత్సాహంగా ఉండటం వ్యక్తులను బట్టి ఉంటుంది. ఫార్మాట్‌ను బట్టి ఆట ఆడాలనే దానికి నేను విరుద్ధం. మూడు ఫార్మాట్లలో నాణ్యమైన ఆటతీరును చూపెట్టాల్సిందే. జట్టు మొత్తం ఇదే విధంగా ఆడుతుందని నమ్ముతున్నా. మానసికంగా కొద్దిగా వెసులుబాటు చేసుకోవడం తప్పనిసరి. భిన్న ఫార్మాట్లకు శరీరం భిన్నంగా స్పందిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాలి అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

మిడిలార్డర్‌లో హార్దిక్, కేదార్ జాదవ్‌ల రాకతో ధోనీపై మ్యాచ్ ఫినిష్ చేసే ఒత్తిడి చాలా తగ్గిందని విరాట్ చెప్పాడు. లోయర్ మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్నేండ్లుగా మహీపై అధిక భారం ఉండేది. ఎందుకంటే సరైన ఆటగాళ్లు అందుబాటులో లేక మ్యాచ్‌ను ముగించే ఒత్తిడి మొత్తం అతనిపైనే పడేది. ఇప్పుడు జాదవ్, హార్దిక్ ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో బాగా ఆడుతున్నారు. జట్టు కూడా మంచి సమతుల్యంతో కనిపిస్తున్నది. ప్రణాళికలను ఎంత మేరకు అమలు చేస్తారన్నది ఈ టోర్నీలో తేలుతుంది అని విరాట్ వెల్లడించాడు. విదేశీ గడ్డపై రాణించేలా తాను మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో ఆడటం పెద్ద సవాలని, దీన్ని అధిగమించి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నాడు.

మాంచెస్టర్‌లో పేలుళ్లు జరిగినప్పటికీ క్రికెట్‌పై తమ దృష్టి సడలలేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నాడు. కొన్ని రోజుల కిందట ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమైనవి. ఇవి ప్రతి ఒక్కర్ని చాలా కలిచివేశాయి. ఇంగ్లండ్‌లాంటి ప్రాంతాల్లో గతంలో ఇలాంటి సంఘటనలు పెద్దగా జరుగలేదు. కాబట్టి ఈ ఉదంతాన్ని చూసి కొంతమంది భయపడి ఉండొచ్చు. కానీ మా జట్టు మొత్తం క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించింది అని కోహ్లీ అన్నాడు. 

e-max.it: your social media marketing partner

ముఖ్యమంత్రి చెంతకు ఆళ్లగడ్డ టిడిపి వర్గ పోరు పంచాయితీ

ఆళ్లగడ్డ టిడిపి నేతల వర్గపోరు పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా భాజపా గెలవదు: ఎస్‌.జైపాల్‌రెడ్డి

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీన...

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అ...

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి భగ్గుమన్న భూవివాదం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలులో మరోసారి భగ్గుమన్నది భూవివాదం. బినామి కౌలుదార్లు-పట్టదారుల మద్య ర...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ట...

సినీ పరిశ్రమలో తాజా పరిణామాల పై చిరంజీవి ఆధ్వర్యంలో మొదలైన చర్చ

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి ఆధ్వర్యంలో 18 మంది హీరోలతో కీలక సమావేశం జరుగుతుంది,

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...