భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ కావాలంటున్నారు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిలు. ఇటీవల కాలంలో టీమిండియా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో వారికి మరింత పదును పెడితే బాగుంటుందనేది వీరి ఆలోచన. దానిలో భాగంగా బౌలింగ్ కోచ్ ఏర్పాటు చేస్తే బాగుంటదని బీసీసీఐ నిర్వాహకుల కమిటీకి విజ్ఞప్తి చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆ క్రమంలోనే భారత్ బౌలింగ్ కోచ్ ప్రతిపాదన మరొకసారి తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించాలని హర్భజన్ సింగ్ కోరుతున్నాడు.

కబడ్డీ ఆక్షన్ లో కాసుల వర్షం కురిసింది. కొత్తగా నాలుగు జట్లు వచ్చి చేరడంతో జట్ల సంఖ్య 12కి చేరింది. ప్రో కబడ్డీ సీజన్ 5 కోసం జరిగిన వేలంలో  నితిన్ తోమర్  93 లక్షల రికార్డ్ ధర పలికాడు. కొత్త జట్టు ఉత్తర్ ప్రదేశ్ నితిన్ తోమర్ ను కొనుగోలు చేసింది. రోహిత్ కుమార్ ను బెంగళూరు బుల్స్ 81 లక్షలకు కొనుగోలు చేయగా, మంజీత్‌ చిల్లర్‌ను 75 లక్షల ధరకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది.

సాధారణంగా ప్రారంభం అయిన ప్రో కబడ్డీ లీగ్ అంచలంచెలుగా ఆదరణ పెంచుకుంటూ, ఐపీఎల్ తర్వాత భారత్ లో అత్యంత ఆదరణ కలిగిన లీగ్ గా అవతరించింది. వివో స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఐదు ఏళ్లకు టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉండటానికి 300 కోట్లు చెల్లించటానికి ముందుకు వచ్చిందంటే ఈ లీగ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ క్రీడకు ఈ స్థాయి ఆదరణతో ఈ లీగ్ ఆటగాళ్ల భవిష్యత్ కూడా మారిపోయింది.

నితిన్ తోమర్ 93 లక్షలు పలకటంతో నితిన్ గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అతను స్పందిస్తూ వేలం పాటలో నాకు రూ.93 లక్షల ధర పలకడం నమ్మలేకపోతున్నా. ఇంట్లో, ఊళ్ళో ఒకటే సంబరాలు చేసుకుంటున్నారు. రూ.50 లక్షలు వస్తే అంతే చాలనుకున్నా. కానీ దాదాపుగా రెట్టింపు డబ్బు లభించింది. ఈ డబ్బుతో సోదరి పెళ్ళి చేస్తా. మాకున్న భూమిలో వ్యవసాయం కోసం ఖర్చు చేస్తా అని నితిన్ తోమర్ అన్నాడు.

తెలుగు టైటాన్స్ తమ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ని తమతోనే అట్టిపెట్టుకుంది. అలాగే యు ముంబా జట్టు అనూప్ కుమార్, పూణే దీపక్ హూడా, బెంగళూరు ఆశిష్ కుమార్, పాట్నా ప్రదీప్ నర్వాల్, బెంగాల్ జంగ్ కున్ లీ, ఢిల్లీ మీరజ్ షేక్ ను అంటిపెట్టుకున్నాయి. జైపూర్ జట్టు ఒక్క ఆటగాణ్ణి కూడా తమతో రెటైన్ చేసుకోలేదు. అలాగే కొత్త జట్లు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, తమిళ్ నాడు జట్లకు నిర్వాహకులు వేలంతో సంబంధం లేకుండా ఒక ఆటగాణ్ణి తీసుకునేలా అవకాశం ఇచ్చారు. గుజరాత్ ఫజల్ అత్రచలి, తమిళ్ నాడు అజయ్ ఠాకూర్, హర్యానా సురేందర్ నాడా ను తీసుకున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ జట్టు రాకేష్ కుమార్, రోహిత్ రానా, వికాశ్ కుమార్, విశాల్ భరద్వాజ్, వినోద్ కుమార్, నీలేష్ సాలుంకే లను వేలంలో దక్కించుకుంది. 

 ప్రముఖ ఆటగాళ్లకు పలికిన ధరలు నితిన్‌ తోమర్‌- ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.93 లక్షలు, రోహిత్‌కుమార్‌- బెంగళూరు- రూ.81 లక్షలు, మంజీత్‌ చిల్లార్‌- జైపుర్‌ - రూ.75.50 లక్షలు, సెల్వమణి- జైపుర్‌ - రూ.73 లక్షలు, రాజేశ్‌ నర్వాల్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.69 లక్షలు, సందీప్‌ నర్వాల్‌ - పుణెరి- రూ.66 లక్షలు, సుర్జీత్‌సింగ్‌ - బెంగళూరు- రూ.73 లక్షలు అమిత్‌ హుడా - తమిళనాడు- రూ.63 లక్షలు, కుల్‌దీప్‌ - యు ముంబా- రూ.51.50 లక్షలు

ఐపీఎల్-10 టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరు కనబరిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్-2లో కూడా కోల్ కతా పై ఘన విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాట్టింగ్ అప్పగించింది ముంబై జట్టు. బుమ్రా, కరణ్ శర్మ విజృంభించటంతో 7 ఓవర్లకి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోల్ కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.

ఐపీఎల్లో సూపర్ డూపర్  నాకౌట్ పాయింట్స్ టేబుల్లో మూడు, నాలుగో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ బిగ్ ఫైట్ లో పంచ్ ఎవ్వరికి పడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే టైటిలే టార్గెట్ గా కేకేఆర్ కదంతొక్కుతోంది. 

ఐపీఎల్‌-10 తొలి క్వాలిఫయిర్‌ ముగిసింది. ఇక ఎలిమినేటర్‌కు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుకున్నట్లు ఇక్కడ మరో అవకాశం ఉండదు. ఓడిన జట్టు ఇంటికే. మరి నాకౌట్‌ పంచ్‌ తినే జట్టేదో రెండో క్వాలిఫయర్లో ఆడే అవకాశం దక్కించుకునే జట్టేదో ఇవాళ తేలిపోనుంది. బెంగళూరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య అమీతుమీకి అంతా రెడీ అయింది

ఐపీఎల్‌-10 ఆరంభంలో బాగా ఆడి ఆపై తడబడి చివరికి కష్టం మీద ప్లేఆఫ్‌ బెర్తు సంపాదించిన రెండు జట్లు నాకౌట్‌ సమరానికి సిద్ధమయ్యాయి. లీగ్‌ దశలో 3, 4 స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. లీగ్‌ దశలో రెండు జట్లు సమాన విజయాలు సాధించాయి. ముఖాముఖిలో తలో మ్యాచ్‌ గెలిచాయి. బలాబలాలు కూడా దాదాపు సమానం. అందుకే ఎలిమినేటర్‌లో ఫలానా జట్టే ఫేవరెట్‌ అని చెప్పలేం. హైదరాబాద్‌ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తుంటే కోల్‌కతా బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతోంది.

భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబి, సిద్దార్థ్‌ కౌల్‌, మహ్మద్‌ సిరాజ్‌.. ఇలా సన్‌రైజర్స్‌ బౌలర్లలో ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో సత్తా చాటుకున్నవారే. ఎలిమినేటర్‌లో భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌ల పాత్ర కీలకం. గతంలో బ్యాటింగ్‌ స్వర్గధామంగా ఉన్న చిన్నస్వామి స్టేడియం ఈ సీజన్లో బౌలర్లకు అనుకూలంగా మారడం తమకు కలిసొస్తుందని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. ఐతే ఆ జట్టును ఫిట్‌నెస్‌ సమస్యలు వేధిస్తున్నాయి. సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ నెహ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను ఇక ఈ సీజన్లో ఆడడు. వేలి గాయంతో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న యువరాజ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌లో వార్నర్‌ మీదే ఎక్కువ ఆధారపడుతుండటం  హైదరాబాద్‌ బలహీనత. ధావన్‌, హెన్రిక్స్‌, యువరాజ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం కీలకం. విలియమ్సన్‌ ఆడితే బ్యాటింగ్‌ బలపడొచ్చు. 

మరోవైపు కోల్‌కతా బౌలింగ్‌లో నిలకడ లేకపోయినా ఆ జట్టు బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఓపెనర్లు లిన్‌, నరైన్‌లను కట్టడి చేయడం మీదే సన్‌రైజర్స్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్లిద్దరికీ పగ్గాలు వేయకపోతే మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. వీళ్ల తర్వాత కూడా గంభీర్‌, ఉతప్ప, మనీష్‌ పాండే, గ్రాండ్‌హోమ్‌లతో నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో బౌల్ట్‌, ఉమేశ్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌ల మీద ఆశలు పెట్టుకుంది నైట్‌రైడర్స్‌.

ఐపీఎల్‌-10 లీగ్‌ దశ ముఖాముఖిలో సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ తలో మ్యాచ్‌ గెలిచాయి. రెండు జట్లూ ఎవరి మైదానంలో వాళ్లు మ్యాచ్‌ నెగ్గారు. తమ సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 48 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు చేయగా.. కోల్‌కతా 161/7కే పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కష్టాలు రోగులను...

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక టీడీపీ కార్యకర్త మృతి...

జీఎస్టీకి నిరసనగా రోడ్డెక్కిన ఖమ్మంలోని వ్యాపారులు

గ్రానైట్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28శాతం జీఎస్టీకి నిరసనగా ఖమ్మంలో వ్యాపారులు రోడ్డెక్కారు. కేంద్రం...

నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనపరచిన జగిత్యాల జిల్లా విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి అలేఖ్య అనే విద్యార్థిని నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి మ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మ‌రోసారి భారత్ ఫై పాక్ దాడి

భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధ...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...