అతని స్ఫూర్తిగా క్రికెట్‌లోకి అడుగు పెట్టినవారు, అతనితో కలిసి ఆడినవారు, ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్‌ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో ముంబైలోని వెర్సోవా థియేటర్‌ కళకళలాడింది. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందు సచిన్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌–ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. తమకు పెద్దన్నలాంటి క్రికెట్‌ దేవుడి సినిమాను జట్టు మొత్తం ఉత్సాహంగా తిలకించింది.

సచిన్‌ టెండూల్కర్ జీవిత విశేషాలతో రూపొందిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమాను టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముందే చూసేశారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని బుధవారం భారత ఆటగాళ్లకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కు బయల్దేరే ముందు కోహ్లీసేన ముంబయిలోని ఓ థియేటర్లో ‘సచిన్‌’ సినిమాను వీక్షించింది.

ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని గర్ల్‌ఫ్రెండ్ అనుష్క ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్‌సూట్‌లో అనుష్క, సరికొత్త హెయిర్  స్టెల్‌లో విరాట్ దర్శనమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టు మొత్తం ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేసింది. యువీ తన డ్యాన్స్‌లతో అక్కడ ఉన్న అందర్ని ఆకట్టుకోగా, ధోనీ, సచిన్‌ల ముచ్చట్లు హైలెట్‌గా నిలిచాయి. 

బ్లాక్ సూట్‌లో సచిన్, పింక్ డ్రెస్‌లో మెరిసిపోయిన అంజలి ఈ గ్రాండ్ షోకు వచ్చిన అందరికీ ఆత్మీయస్వాగతం పలికారు. మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్, సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్, స్టార్ బాక్సర్ విజేందర్, ప్రముఖ గాయని ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ దంపతులు, పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఐపీఎల్ ముగిసిపోవడంతో ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు బయల్దేరనుంది. బుధవారం సాయంత్రం ఇంగ్లాండ్ కి జట్టు మొత్తం బయల్దేరనుంది. అయితే వెళ్లేముందు జట్టు మొత్తం కలిసి ముంబైలో 'సచిన్ ది బిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని వీక్షించనున్నారు. ఈ మేరకు సచిన్ చిత్ర నిర్మాత రవి భగచ్కంద ఆటగాళ్లు అందరికి ఆహ్వానాలు పంపారు. ముంబైలోని వెర్సోవాలో జట్టు మొత్తానికి ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ కావాలంటున్నారు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిలు. ఇటీవల కాలంలో టీమిండియా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో వారికి మరింత పదును పెడితే బాగుంటుందనేది వీరి ఆలోచన. దానిలో భాగంగా బౌలింగ్ కోచ్ ఏర్పాటు చేస్తే బాగుంటదని బీసీసీఐ నిర్వాహకుల కమిటీకి విజ్ఞప్తి చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆ క్రమంలోనే భారత్ బౌలింగ్ కోచ్ ప్రతిపాదన మరొకసారి తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించాలని హర్భజన్ సింగ్ కోరుతున్నాడు.

కబడ్డీ ఆక్షన్ లో కాసుల వర్షం కురిసింది. కొత్తగా నాలుగు జట్లు వచ్చి చేరడంతో జట్ల సంఖ్య 12కి చేరింది. ప్రో కబడ్డీ సీజన్ 5 కోసం జరిగిన వేలంలో  నితిన్ తోమర్  93 లక్షల రికార్డ్ ధర పలికాడు. కొత్త జట్టు ఉత్తర్ ప్రదేశ్ నితిన్ తోమర్ ను కొనుగోలు చేసింది. రోహిత్ కుమార్ ను బెంగళూరు బుల్స్ 81 లక్షలకు కొనుగోలు చేయగా, మంజీత్‌ చిల్లర్‌ను 75 లక్షల ధరకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది.

సాధారణంగా ప్రారంభం అయిన ప్రో కబడ్డీ లీగ్ అంచలంచెలుగా ఆదరణ పెంచుకుంటూ, ఐపీఎల్ తర్వాత భారత్ లో అత్యంత ఆదరణ కలిగిన లీగ్ గా అవతరించింది. వివో స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఐదు ఏళ్లకు టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉండటానికి 300 కోట్లు చెల్లించటానికి ముందుకు వచ్చిందంటే ఈ లీగ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ క్రీడకు ఈ స్థాయి ఆదరణతో ఈ లీగ్ ఆటగాళ్ల భవిష్యత్ కూడా మారిపోయింది.

నితిన్ తోమర్ 93 లక్షలు పలకటంతో నితిన్ గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అతను స్పందిస్తూ వేలం పాటలో నాకు రూ.93 లక్షల ధర పలకడం నమ్మలేకపోతున్నా. ఇంట్లో, ఊళ్ళో ఒకటే సంబరాలు చేసుకుంటున్నారు. రూ.50 లక్షలు వస్తే అంతే చాలనుకున్నా. కానీ దాదాపుగా రెట్టింపు డబ్బు లభించింది. ఈ డబ్బుతో సోదరి పెళ్ళి చేస్తా. మాకున్న భూమిలో వ్యవసాయం కోసం ఖర్చు చేస్తా అని నితిన్ తోమర్ అన్నాడు.

తెలుగు టైటాన్స్ తమ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ని తమతోనే అట్టిపెట్టుకుంది. అలాగే యు ముంబా జట్టు అనూప్ కుమార్, పూణే దీపక్ హూడా, బెంగళూరు ఆశిష్ కుమార్, పాట్నా ప్రదీప్ నర్వాల్, బెంగాల్ జంగ్ కున్ లీ, ఢిల్లీ మీరజ్ షేక్ ను అంటిపెట్టుకున్నాయి. జైపూర్ జట్టు ఒక్క ఆటగాణ్ణి కూడా తమతో రెటైన్ చేసుకోలేదు. అలాగే కొత్త జట్లు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, తమిళ్ నాడు జట్లకు నిర్వాహకులు వేలంతో సంబంధం లేకుండా ఒక ఆటగాణ్ణి తీసుకునేలా అవకాశం ఇచ్చారు. గుజరాత్ ఫజల్ అత్రచలి, తమిళ్ నాడు అజయ్ ఠాకూర్, హర్యానా సురేందర్ నాడా ను తీసుకున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ జట్టు రాకేష్ కుమార్, రోహిత్ రానా, వికాశ్ కుమార్, విశాల్ భరద్వాజ్, వినోద్ కుమార్, నీలేష్ సాలుంకే లను వేలంలో దక్కించుకుంది. 

 ప్రముఖ ఆటగాళ్లకు పలికిన ధరలు నితిన్‌ తోమర్‌- ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.93 లక్షలు, రోహిత్‌కుమార్‌- బెంగళూరు- రూ.81 లక్షలు, మంజీత్‌ చిల్లార్‌- జైపుర్‌ - రూ.75.50 లక్షలు, సెల్వమణి- జైపుర్‌ - రూ.73 లక్షలు, రాజేశ్‌ నర్వాల్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.69 లక్షలు, సందీప్‌ నర్వాల్‌ - పుణెరి- రూ.66 లక్షలు, సుర్జీత్‌సింగ్‌ - బెంగళూరు- రూ.73 లక్షలు అమిత్‌ హుడా - తమిళనాడు- రూ.63 లక్షలు, కుల్‌దీప్‌ - యు ముంబా- రూ.51.50 లక్షలు

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

తూర్పుగోదావరి జిల్లాలో పొలంలో రైతు దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన చుండ్రు రాఘవులు అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు....

మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్ల ఆగ్రహం

విశాఖ మ‌హానాడులో ఏర్పాట్లు స‌క్రమంగా లేవంటూ తెలుగుత‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హానాడు ప్రాంగ‌ణంలో ఏర్పా...

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇరువురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన షబ్బీర్ హుస్సేన్ కుటుంబం ఆసిఫా...

ఆలేరులో పాముకాటుకు బాలుడు బలి

యాదాద్రి జిల్లా ఆలేరులో దారుణం జరిగింది. స్థానిక చింతలబస్తీకి చెందిన నితిన్ అనే బాలుడు పాముకాటుకు గురవ్వగా బాల...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేష‌న్

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధిం...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...