జోస్ బట్లర్ బెంబేలెత్తించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ  సీజన్ లో ఇప్పటివరకు మెరుపులు మెరిపించని ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కీలక మ్యాచులో చెలరేగి ఆడాడు. టార్గెట్ ఎంతున్నా తన మార్కు బ్యాటింగ్ తో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు.

హషీమ్‌ ఆమ్లా పక్కా టెస్టు ఆటగాడు. అసలు ఇలాంటి ఆటగాడికి ఐపీఎల్‌లో చోటు ఎలా దక్కిందో ఇవీ సగటు క్రికెట్‌ అభిమాని అతడిపై చేసే కామెంట్స్‌. అయితే అలాంటి వారికి సమాధానంగా అన్నట్టు పొట్టి ఫార్మాట్‌లోనూ తనదైన క్లాస్‌ ఇన్నింగ్స్‌కు చోటుంటుందని ఈ ఓపెనర్‌ నిరూపించాడు. అతడి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ చూసి ఆడుతోంది ఆమ్లానేనా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఒక్క సిక్స్‌ కొడితే గ్రేట్‌ అనుకునే తన బ్యాట్‌ నుంచి ఏకంగా ఆరు సిక్సర్లు బుల్లెట్‌ వేగంతో స్టాండ్స్‌ను ముద్దాడగా... 58 బంతుల్లోనే కెరీర్‌లో తొలి టి-20 శతకాన్ని అందుకుని జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. ఇందులో 51 పరుగులు ఒక్క మలింగ బౌలింగ్‌లోనే సాధించడం విశేషం.

తనను విమర్శించిన వారు సిగ్గుపడేలా చేశాడు ఆమ్లా. అడ్డ దిడ్డమైన షాట్లతోనే కాకుండా క్లాసిక్‌ ఆటతోనూ విధ్వసం సృష్టించొచ్చని ముంబైపై శతక గర్జన చేసి మరీ చెప్పాడు. ఒకటా రెండా మణికట్టు మాయాజాలం చూసిస్తూ అతను కొట్టిన స్ట్రయిట్‌ డ్రైవ్‌లు, కట్‌ షాట్లు అభిమానులను మంత్రముగ్దుల్ని చేశాయి. విధ్వంసకర బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ మెరుపులు మెరిపించి అవుట్ అయినా జట్టు స్కోర్ పెంచే బాధ్యత తీసుకొని స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. మలింగా బౌలింగును ఉతికిన తీరు హైలెట్. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మలింగ వేసిన ఓవర్లో ఆమ్లా రెండు సిక్సర్లు బాది సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆమ్లా సెంచరీ చేసినా... పంజాబ్ భారీ స్కోర్ చేసినా ఆ జట్టు ఓడిపోవడంతో ఆమ్లా సెంచరీ బూడిదలో పోసిన పన్నీరైంది.

ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబయి హవా కొనసాగుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై... ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సొంతగడ్డపైనే కాకుండా ప్రత్యర్థుల వేదికల్లో రాణిస్తూ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. నితీశ్ రానా, బట్లర్ వీరోచితంగా ఆడి తమ జట్టును గెలిపించారు. బట్లర్‌, నితీశ్‌ రాణా విజృంభించి ఆడటంతో ముంబయి 199 పరుగుల విజయలక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలోవకగా ఛేదించింది. దీంతో పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ హషిమ్ ఆమ్లా సెంచరీ వృధా అయ్యింది. పంజాబ్‌ బౌలర్ల పేలవ బౌలింగ్‌ను ముంబయి టాప్‌ ఆర్డర్‌ చిత్తు చేసింది. ముంబై బ్యాట్స్ మెన్ నితీశ్ రాణా 34 బంతుల్లో 62 పరుగులు చేసాడు అందులో 7 సిక్సర్లు ఉన్నాయ్. కానీ ఒక్క 4 కూడా లేకపోవడం గమనార్హం. 37 బంతుల్లో 77 పరుగులు చేసిన బట్లర్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు. 

టెన్నిస్ సంచలనం 'సెరీనా విలియమ్స్' తర్వలో తల్లికాబోతున్నట్టు తెలిపింది. స్నాప్ చాట్ లో ఆమె తాజా ఫోటోను కూడా షేర్ చేసింది. త్వరలోనే తాను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు చెబుతున్న సెరీనా ఆవెంటనే పోస్ట్ ను తొలగించడం విశేషం. 32 ఏళ్ల అలెక్సిస్ ఒహానియాన్ తో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిన సెరీనా ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ కూడా జనవరిలో ఆడటం విశేషం. 35 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్ ఇప్పటివరకూ 23 గ్రాండ్ స్లామ్ లను సొంతం చేసుకుని వ్యక్తిగత జీవితంలో  స్థిరపడబోతున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయం నుండి శశికళ, దినకరన్‌ బ్యానర్లు తొలగింపు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కలకలం చోటుచేసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్క...

అరవింద్ కేజ్రీవాల్ కు సరికొత్త సమస్య...

అరవింద్ కేజ్రీవాల్ కు సరికొత్త సమస్య మొదలైంది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపా...

నెల్లూరులో బాహుబలి సందడి

నెల్లూరు జిల్లాలో బాహుబలి-2 సందడే సందడి నెలకొంది. నెల్లూరులో సినిమా హిట్ అయితే అది బ్లాక్ బస్టర్ అవుతుందనేది ఒ...

కోడుమూరులో నిలిపివేసిన బాహుబలి 2 సినిమా ప్రదర్శన

కోడుమూరులో బాహుబలి 2 సినిమా ప్రదర్శనను నిలిపేశారు. థియేటర్ యాజమాన్యానికి, అభిమానులకు మధ్య విభేదాలు రావడంతో ప్ర...

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం:ఉత్తమ్ కుమార్ రెడ్డి

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా...

ఖమ్మం మిర్చి యార్డ్ పై రైతుల దాడి

ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ పై రైతులు దాడిచేశారు. మిర్చికి కనీస మద్దతు ధర కల్పించకుండా, జెండా పాట నిర్వహించకప...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

ఒడిశాలో మావోయిస్టుల మారణ హోమం...

మావోయిస్టుల మారణ హోమం రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భారీ సంఖ్యలో సీఆర్...

సుబ్రతో రాయ్ ను హెచ్చరించిన సుప్రీం కోర్టు

జూన్ 15వ తేదీలోగా 2వేల 550 కోట్లు షేర్ హోల్డర్స్ కు చెల్లించలేకపోతే జైలుకెళ్లక తప్పదని సహారా గ్రూప్ అధినేత సుబ...

యువకుడిని చితకబాదిన ఎస్సై...అపస్మారక స్థితిలో ప్రవీణ్

మైనర్ బాలికను ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఆ యువకుడు అప...

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

రైలు నుంచి ఓ యువకుడిని దింపి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

రాజమౌళి గురించి తెలియని నిజం ఇదే!

రాజమౌళి గురించి తెలియని నిజం ఇదే!

దర్శక దిగ్గజం, బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో దేవుడికి సంబంధించిన సన్నివేశం ఉంటుంద...

'బాహుబలి-2' మూవీ రివ్యూ...

'బాహుబలి-2' మూవీ రివ్యూ...

Bahubali-2 సమర్పణ: కె.రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌ టైటిల్: 'బాహుబలి-2':ది కంక్లూజన్ తార...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న 'గంభీర్'

కేకేఆర్ కెప్టెన్ గౌతం గంభీర్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న గంభీర్ ప్రస్తుతం టాప్ స్కోరర్ గా...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...