ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గుప్తిల్ ఈ ఈ క్యాచ్ పట్టిన తీరుని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న మార్టిన్ గుప్తిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గుప్తిల్ అది అసాధ్యమని భావించి కేవలం ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతేకాదు ఆపై బౌండరీ లైన్‌ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకున్నాడు. గుప్తిల్ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సీజన్‌లో కొంత మంది స్టార్‌ ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనే అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. లాభదాయకమైన ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్లు ఆడకుండా నిరోధించడంతో పాటు వారిని ఆకర్షించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మల్టీ- ఇయర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ఆటగాళ్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఆస్ట్రేలియా పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. ఈ ప్రతిపాదనను ఆసీస్ క్రికెటర్లు అంగీకరిస్తే వచ్చే ఐపీఎల్‌లో ఆసీస్ క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్ లో ఆడరు. 

ప్రపంచ క్రికెట్‌లో ఇన్నాళ్లూ మనదే ఆధిపత్యం బీసీసీఐ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఆదాయ పంపిణితో పాటు ఐసీసీలో సంస్కరణల విషయంలో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటి నుంచి మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో బీసీసీఐకి వ్యతిరేకంగా ఏ దేశ బోర్డు కూడా ఆటగాళ్లను పంపకుండా ఉంటామని ధైర్యంగా చెప్పలేకపోయాయి.

మా దేశంలో మీ పర్యటన లేకుంటే మా క్రికెటర్లు ఐపీఎల్ ఆడబోరని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈవో హరూన్ లోర్గాత్ లేఖ రాయగా తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన ఆటగాళ్ల విషయంలో కఠిన నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఐపీఎల్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చే సీజన్ ఐపీఎల్ నుంచి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో రెండునెలలు దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండడం లేదు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సుదీర్ఘ కాంట్రాక్ట్ రూపంలో ఆటగాళ్ల కాళ్లకు బంధాలేసేలా ప్రణాళికలు రచిస్తుంది. 

ఈ నిబంధనతో ఆసీస్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడినందుకు వచ్చే రాబడి కన్నా మిన్నగా వచ్చేలా కాంట్రాక్ట్ నిబంధన విధించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో ఆటగాళ్లు గాయపడే అవకాశం కూడా ఉండదని సుదీర్ఘంగా ఆడడంతో కీలక పర్యటనలకు ఆసీస్ స్టార్లు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 

ఆసీస్ స్టార్లు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్ , హాజెల్‌వుడ్, ప్యాట్‌కమిన్స్ లాంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని సీఏ ఆలోచన. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని ఆసీస్ క్రికెటర్లు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరహా కాంట్రాక్టులతో క్రికెట్ ఆస్ట్రేలియా పాలకవర్గానికి మాత్రమే లబ్ది చేకూరుతుందని వారు వాపోతున్నారు. ఈ తరహా కాంట్రాక్టులు సమ్మతం కాదంటూ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేశారు.

వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌ కప్పును తిరిగి దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తానని డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తిరిగి వన్డే జట్టులోకి తాను ఎంపికవడం ఆనందం కలిగించిందని అన్నాడు యువీ. ఈ టోర్నీ సవాలుతో కూడుకుంది అని, టోర్నీలో ఆడే ప్రతీజట్టు చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుంది అని, తాము ఉన్న గ్రూప్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది, అయితే వరుసగా రెండోసారి టోర్నీ నెగ్గేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని యువరాజ్ సింగ్ అన్నాడు.

చీఫ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే సహా భారత క్రికెట్‌ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోచ్‌గా కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్‌ వచ్చే జూన్‌తో ముగుస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్‌గా కుంబ్లేకు చాంపియన్స్‌ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే కోచ్ పై నిర్ణయం తీసుకోనుంది. 

మోహన్ బాబుపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సినీనటుడు మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జి...

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మహిళల మృతదేహాల లభ్యం

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. బుట్టయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం సమీపంలో ఇద...

కడప జిల్లాలో పిచ్చికుక్కుల స్వైర విహారం.. 12మందిపై దాడి

కడప జిల్లా రాజంపేట పట్టణంలో పిచ్చి కుక్కులు స్వైర విహారం చేశాయి. ఏకంగా 12మందిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయప...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

రెండు క్రూడ్‌ బాంబులను స్వాధీనం చేసుకున్న బీహార్‌ పోలీసులు

పాట్నా: భారీ ఉగ్ర కుట్రను బీహార్‌ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్‌(బుద్ధ) గయలో మరో మారణహోమం జరగకుండా ని...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

శామీర్‌పేట్‌ లో దారుణ సంఘటన....

వివాహేతర సంబంధాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ...

కామాంధుడి చేతిలో మోసపోయిన మైనర్ బాలిక

ప్రేమించమని వెంటపడ్డాడు. డబ్బు నగలు ఆశచూపి వశబరుచుకున్నాడు. అమ్మవారి సన్నిధిలో మెడలో గొలుసు వేసి ఇదే పెళ్లన్నా...

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

వివాదాస్పద 'పద్మావత్' చిత్రానికి ఇచ్చిన సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని కోరుతూ శుక్రవారం దాఖలైన మరో పిట...

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...