అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజరాత లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ నంద కిషోర్‌తో వాగ్వాదానికి దిగి లెవెల్‌-1 తప్పిదానికి పాల్పడడంతో సందీప్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. గుజరాత్ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో సందీప్‌ వేసిన ఐదో బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే దీనిపై సందీప్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కాసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు ముందుగా చెప్పకుండా గార్డ్ మార్చడంతో అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్‌ సినిమాతో తన జీవితంలోని కీలక ఘట్టాలను అభిమానులతో పంచుకోవటం చాలా సంతోషంగా ఉందన్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం లండన్ లో పర్యటిస్తున్న సచిన్ తన జీవితం, క్రికెటర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఈ మూవీలో ఉన్నట్లు తెలిపాడు. బ్రిటన్ కు చెందిన జేమ్స్‌ ఎర్‌స్కిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధోనీ, సెహ్వాగ్‌ కూడా నటించారు.

కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ప్రొ కబడ్డీపై కాసుల వర్షం కురిసింది. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కించుకునేందుకు మొబైల్‌ ఫోన్‌ సంస్థ వివో 300 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వివోతో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టార్‌స్పోర్ట్స్‌ ప్రకటించింది. ఈ లీగ్ లో ఐదో సీజన్ జులైలో ఆరంభమవుతుంది. మూడు నెలలకు పైగా జరిగే ఈ లీగ్ లో 12 జట్లు 130కి పైగా మ్యాచ్‌లు ఆడనున్నాయి.

డేవిడ్ వార్నర్ దంచికొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో ఉప్పెనలా చెలరేగాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ పై సవారి చేశాడు. ఏ బౌలర్ ను వదలకుండా కుమ్మేశాడు. వార్నర్ ధాటికి బంతి బౌండరీ బయటే నాట్యం చేసింది. చూస్తుండగానే స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన వార్నర్ సెంచరీతో చెలరేగాడు. నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ కు గ్రాండ్ విక్టరీ అందించాడు. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరుగు లేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

టీడీపీని విమర్శిస్తున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు

ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ గాలికి వదిలేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. రాయలసీమ...

ఉత్కంఠ రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్

క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్ ఉత్కంఠను రేపుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు బిరుదవ...

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమానంలో మూడో వరుసలో ఉన్న తన సీ...

సికింద్రాబాద్ లో ఘనంగా జరిగిన ఓనం పండుగ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మళయాళీలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ఐదుగురికి తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొంది ఒక ఆర్టీసీ బస్సు. ఘటనలో...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

ప్రియాంకపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్టీ బాధ్యత...

లోక్ సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు

లోక్ సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోడీ ఆలోచన. దీనికి రాజ్యాంగపరంగా అనేక ఇ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్య

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్యకు గురయ్యింది. మృతురాలు పొన్నలూరు మండలం యొల్లటూరు గ్రామానికి చెందిన...

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త. డానియల్ క్రెగ్ మళ్ళీ జేమ్స్ బాండ్ గా నటించేందుకు అంగీకరించాడు. వరుసగా అయిదు...

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు ప...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...