వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సీజన్‌లో కొంత మంది స్టార్‌ ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనే అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. లాభదాయకమైన ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్లు ఆడకుండా నిరోధించడంతో పాటు వారిని ఆకర్షించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మల్టీ- ఇయర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ఆటగాళ్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఆస్ట్రేలియా పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. ఈ ప్రతిపాదనను ఆసీస్ క్రికెటర్లు అంగీకరిస్తే వచ్చే ఐపీఎల్‌లో ఆసీస్ క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్ లో ఆడరు. 

ప్రపంచ క్రికెట్‌లో ఇన్నాళ్లూ మనదే ఆధిపత్యం బీసీసీఐ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఆదాయ పంపిణితో పాటు ఐసీసీలో సంస్కరణల విషయంలో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటి నుంచి మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో బీసీసీఐకి వ్యతిరేకంగా ఏ దేశ బోర్డు కూడా ఆటగాళ్లను పంపకుండా ఉంటామని ధైర్యంగా చెప్పలేకపోయాయి.

మా దేశంలో మీ పర్యటన లేకుంటే మా క్రికెటర్లు ఐపీఎల్ ఆడబోరని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈవో హరూన్ లోర్గాత్ లేఖ రాయగా తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన ఆటగాళ్ల విషయంలో కఠిన నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఐపీఎల్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చే సీజన్ ఐపీఎల్ నుంచి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో రెండునెలలు దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండడం లేదు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సుదీర్ఘ కాంట్రాక్ట్ రూపంలో ఆటగాళ్ల కాళ్లకు బంధాలేసేలా ప్రణాళికలు రచిస్తుంది. 

ఈ నిబంధనతో ఆసీస్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడినందుకు వచ్చే రాబడి కన్నా మిన్నగా వచ్చేలా కాంట్రాక్ట్ నిబంధన విధించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో ఆటగాళ్లు గాయపడే అవకాశం కూడా ఉండదని సుదీర్ఘంగా ఆడడంతో కీలక పర్యటనలకు ఆసీస్ స్టార్లు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 

ఆసీస్ స్టార్లు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్ , హాజెల్‌వుడ్, ప్యాట్‌కమిన్స్ లాంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని సీఏ ఆలోచన. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని ఆసీస్ క్రికెటర్లు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరహా కాంట్రాక్టులతో క్రికెట్ ఆస్ట్రేలియా పాలకవర్గానికి మాత్రమే లబ్ది చేకూరుతుందని వారు వాపోతున్నారు. ఈ తరహా కాంట్రాక్టులు సమ్మతం కాదంటూ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేశారు.

వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌ కప్పును తిరిగి దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తానని డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తిరిగి వన్డే జట్టులోకి తాను ఎంపికవడం ఆనందం కలిగించిందని అన్నాడు యువీ. ఈ టోర్నీ సవాలుతో కూడుకుంది అని, టోర్నీలో ఆడే ప్రతీజట్టు చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుంది అని, తాము ఉన్న గ్రూప్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది, అయితే వరుసగా రెండోసారి టోర్నీ నెగ్గేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని యువరాజ్ సింగ్ అన్నాడు.

చీఫ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే సహా భారత క్రికెట్‌ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోచ్‌గా కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్‌ వచ్చే జూన్‌తో ముగుస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్‌గా కుంబ్లేకు చాంపియన్స్‌ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే కోచ్ పై నిర్ణయం తీసుకోనుంది. 

శశాంక్‌ మనోహర్‌ మనసు మార్చుకున్నాడు. ఆదాయ పంపకాల్లో బిగ్‌-త్రి నమూనా స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి బీసీసీఐ వాటాను దాదాపుగా సగం తగ్గించడంతో పాటు భారత క్రికెట్‌ బోర్డుకు వ్యతిరేకంగా పాలనా సంస్కరణలు అమలు చేయడంలో విజయవంతమైన అతడు ఐసీసీ ఛైర్మన్‌గా పూర్తికాలం పదవిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది జూన్‌ వరకు అతడు పదవిలో ఉండనున్నాడు. 

ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎంపిక విషయంలో సందిగ్ధత ముగిసింది. ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌  పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకు అంగీకరించారు. దీని ప్రకారం 2018 జూన్‌ వరకు చైర్మన్‌గా శశాంక్‌ కొనసాగుతారు. రెండు నెలల వ్యవధిలో ఆయన రెండు సార్లు మనసు మార్చుకొని ప్రపంచ క్రికెట్‌ ‘పెద్ద’గా వ్యవహరించేందుకు సిద్ధపడటం విశేషం.

గత మార్చిలో శశాంక్‌ మనోహర్‌ ‘వ్యక్తిగత కారణాలు’ అని చెప్పి ఐసీసీ చైర్మన్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐసీసీ, బీసీసీఐ మధ్య కొనసాగుతున్న వివాదం అందుకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఐసీసీలో పలువురు సభ్యులు ఆయన కొనసాగాలని పట్టుబట్టడంతో జూన్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం వరకు మాత్రమే ఉంటానని శశాంక్‌ హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో ఐసీసీ కొత్త నియమావళి, కొత్త ఆర్థిక నమూనాకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు కూడా ఐసీసీలోని సభ్యులందరూ మరో సారి మనోహర్‌కు గట్టి మద్దతు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి పలు సంస్కరణలు ప్రతిపాదించిన ఆయన వాటిని అమల్లోకి తెచ్చే వరకు బాగుంటుందని వారు సూచించారు.

 ఐసీసీ కొత్త ఆర్థిక విధానంలో భారత్‌ తమ ఆదాయంలో భారీ మొత్తాన్ని కోల్పోనుంది. గతంలో అమల్లో ఉన్న ‘బిగ్‌ త్రీ’ పద్ధతిని తొలగించి కొత్త విధానానికి రూపకల్పన చేయడంలో శశాంక్‌ కీలక పాత్ర పోషించారు. దీనిని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించినా ఐసీసీ ఓటింగ్‌లో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. దాంతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కూడా అయిన మనోహర్‌కు, భారత బోర్డుకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రకటించిన 293 మిలియన్‌ డాలర్లకు అదనంగా మరో 100 మిలియన్‌ డాలర్లు ఇస్తామంటూ శశాంక్‌ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ గట్టిగా తిరస్కరించింది.

భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనా వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ఈ నేపథ్యంలో దీనిని సమర్థంగా పరిష్కరించగల సత్తా మనోహర్‌కే ఉందని ఐసీసీ సభ్యులు భావించారు. భారత బోర్డు, సీఓఏతో చర్చలు జరిపి మధ్యేమార్గంగా ఆయన పరిష్కారం కనుగొనగలరని వారు నమ్ముతున్నారు. ఆ తర్వాత కూడా అంతా సర్దుకునేందుకు కచ్చితంగా మరికొంత సమయం పడుతుంది. కాబట్టి మరింత కాలం ఐసీసీ చైర్మన్‌గా ఆయన కొనసాగడమే సరైందని ఐసీసీ సభ్యులు గట్టిగా నిర్ణయించుకున్నారు. వారి ఒత్తిడి మేరకు మనోహర్‌ పూర్తి కాలం పదవిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

టీడీపీని విమర్శిస్తున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు

ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ గాలికి వదిలేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. రాయలసీమ...

ఉత్కంఠ రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్

క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్ ఉత్కంఠను రేపుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు బిరుదవ...

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమానంలో మూడో వరుసలో ఉన్న తన సీ...

సికింద్రాబాద్ లో ఘనంగా జరిగిన ఓనం పండుగ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మళయాళీలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ఐదుగురికి తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొంది ఒక ఆర్టీసీ బస్సు. ఘటనలో...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

ప్రియాంకపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్టీ బాధ్యత...

లోక్ సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు

లోక్ సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోడీ ఆలోచన. దీనికి రాజ్యాంగపరంగా అనేక ఇ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్య

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్యకు గురయ్యింది. మృతురాలు పొన్నలూరు మండలం యొల్లటూరు గ్రామానికి చెందిన...

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త. డానియల్ క్రెగ్ మళ్ళీ జేమ్స్ బాండ్ గా నటించేందుకు అంగీకరించాడు. వరుసగా అయిదు...

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు ప...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...