ఐపీఎల్ ముగిసిపోవడంతో ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు బయల్దేరనుంది. బుధవారం సాయంత్రం ఇంగ్లాండ్ కి జట్టు మొత్తం బయల్దేరనుంది. అయితే వెళ్లేముందు జట్టు మొత్తం కలిసి ముంబైలో 'సచిన్ ది బిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని వీక్షించనున్నారు. ఈ మేరకు సచిన్ చిత్ర నిర్మాత రవి భగచ్కంద ఆటగాళ్లు అందరికి ఆహ్వానాలు పంపారు. ముంబైలోని వెర్సోవాలో జట్టు మొత్తానికి ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ కావాలంటున్నారు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిలు. ఇటీవల కాలంలో టీమిండియా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో వారికి మరింత పదును పెడితే బాగుంటుందనేది వీరి ఆలోచన. దానిలో భాగంగా బౌలింగ్ కోచ్ ఏర్పాటు చేస్తే బాగుంటదని బీసీసీఐ నిర్వాహకుల కమిటీకి విజ్ఞప్తి చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆ క్రమంలోనే భారత్ బౌలింగ్ కోచ్ ప్రతిపాదన మరొకసారి తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించాలని హర్భజన్ సింగ్ కోరుతున్నాడు.

కబడ్డీ ఆక్షన్ లో కాసుల వర్షం కురిసింది. కొత్తగా నాలుగు జట్లు వచ్చి చేరడంతో జట్ల సంఖ్య 12కి చేరింది. ప్రో కబడ్డీ సీజన్ 5 కోసం జరిగిన వేలంలో  నితిన్ తోమర్  93 లక్షల రికార్డ్ ధర పలికాడు. కొత్త జట్టు ఉత్తర్ ప్రదేశ్ నితిన్ తోమర్ ను కొనుగోలు చేసింది. రోహిత్ కుమార్ ను బెంగళూరు బుల్స్ 81 లక్షలకు కొనుగోలు చేయగా, మంజీత్‌ చిల్లర్‌ను 75 లక్షల ధరకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది.

సాధారణంగా ప్రారంభం అయిన ప్రో కబడ్డీ లీగ్ అంచలంచెలుగా ఆదరణ పెంచుకుంటూ, ఐపీఎల్ తర్వాత భారత్ లో అత్యంత ఆదరణ కలిగిన లీగ్ గా అవతరించింది. వివో స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఐదు ఏళ్లకు టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉండటానికి 300 కోట్లు చెల్లించటానికి ముందుకు వచ్చిందంటే ఈ లీగ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ క్రీడకు ఈ స్థాయి ఆదరణతో ఈ లీగ్ ఆటగాళ్ల భవిష్యత్ కూడా మారిపోయింది.

నితిన్ తోమర్ 93 లక్షలు పలకటంతో నితిన్ గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అతను స్పందిస్తూ వేలం పాటలో నాకు రూ.93 లక్షల ధర పలకడం నమ్మలేకపోతున్నా. ఇంట్లో, ఊళ్ళో ఒకటే సంబరాలు చేసుకుంటున్నారు. రూ.50 లక్షలు వస్తే అంతే చాలనుకున్నా. కానీ దాదాపుగా రెట్టింపు డబ్బు లభించింది. ఈ డబ్బుతో సోదరి పెళ్ళి చేస్తా. మాకున్న భూమిలో వ్యవసాయం కోసం ఖర్చు చేస్తా అని నితిన్ తోమర్ అన్నాడు.

తెలుగు టైటాన్స్ తమ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ని తమతోనే అట్టిపెట్టుకుంది. అలాగే యు ముంబా జట్టు అనూప్ కుమార్, పూణే దీపక్ హూడా, బెంగళూరు ఆశిష్ కుమార్, పాట్నా ప్రదీప్ నర్వాల్, బెంగాల్ జంగ్ కున్ లీ, ఢిల్లీ మీరజ్ షేక్ ను అంటిపెట్టుకున్నాయి. జైపూర్ జట్టు ఒక్క ఆటగాణ్ణి కూడా తమతో రెటైన్ చేసుకోలేదు. అలాగే కొత్త జట్లు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, తమిళ్ నాడు జట్లకు నిర్వాహకులు వేలంతో సంబంధం లేకుండా ఒక ఆటగాణ్ణి తీసుకునేలా అవకాశం ఇచ్చారు. గుజరాత్ ఫజల్ అత్రచలి, తమిళ్ నాడు అజయ్ ఠాకూర్, హర్యానా సురేందర్ నాడా ను తీసుకున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ జట్టు రాకేష్ కుమార్, రోహిత్ రానా, వికాశ్ కుమార్, విశాల్ భరద్వాజ్, వినోద్ కుమార్, నీలేష్ సాలుంకే లను వేలంలో దక్కించుకుంది. 

 ప్రముఖ ఆటగాళ్లకు పలికిన ధరలు నితిన్‌ తోమర్‌- ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.93 లక్షలు, రోహిత్‌కుమార్‌- బెంగళూరు- రూ.81 లక్షలు, మంజీత్‌ చిల్లార్‌- జైపుర్‌ - రూ.75.50 లక్షలు, సెల్వమణి- జైపుర్‌ - రూ.73 లక్షలు, రాజేశ్‌ నర్వాల్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌- రూ.69 లక్షలు, సందీప్‌ నర్వాల్‌ - పుణెరి- రూ.66 లక్షలు, సుర్జీత్‌సింగ్‌ - బెంగళూరు- రూ.73 లక్షలు అమిత్‌ హుడా - తమిళనాడు- రూ.63 లక్షలు, కుల్‌దీప్‌ - యు ముంబా- రూ.51.50 లక్షలు

ఐపీఎల్-10 టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరు కనబరిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్-2లో కూడా కోల్ కతా పై ఘన విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాట్టింగ్ అప్పగించింది ముంబై జట్టు. బుమ్రా, కరణ్ శర్మ విజృంభించటంతో 7 ఓవర్లకి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోల్ కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.

కాంగ్రెస్ లోకి రేవంత్ చేరికపై మీడియాలో పుకార్లు

కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తు...

సీపీయం పార్టీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు

సీపీయం పార్టీపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేరళలో హత్యా రాజకీయాలను సీఎం విజయన్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ పార...

ఏపీలో 36 వేల కోట్లతో ఏరోసిటీ

ఆంధ్రప్రదేశ్ లో 36 వేలకోట్ల రూపాయలతో ఏరోసిటీ నిర్మించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల...

విశాఖలో భక్తులతో పోట్టెత్తిన శివలయాలు

విశాఖలో కార్తిక శోభతో శివలయాలు భక్తులతో పోట్టెతాయి. కార్తికమాసంలో మొదటి సోమవారం కావడం నాగులచవితి కూడా ఈ పరవదిన...

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల బైపాస్ హైవేపై అగ్నిప్రమాదం జరిగింది. ఇచ్చోడ మండలం నుండి ఆదిలాబాద్...

సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై కేసు నమోదైంది. తన ఇంట్లో గంజాయిని ఉంచి తనను గంజాయి కేసులో ఇర...

సింగపూర్‌లో అమరావతికి భూములిచ్చిన రైతుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలౌతున్న వివిధ అభివృద్ధి పథకాలను...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

హైకోర్టు విభజన ప్రక్రియ షురూ

హైకోర్టు విభజనకు రంగం సిద్ధమైంది. తమకు ఏ రాష్ట్రం కావాలో తెలపాల్సిందిగా ఉమ్మడి హైకోర్టులోని జడ్జీలకు ఆప్షన్ అడ...

కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం

కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలపై ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్...

తాగిన మైకంలో కుటుంబసభ్యులను హతమార్చిన కసాయి

ఓ కిరాతకుడు తాగిన మైకంలో కుటుంబసభ్యులను అతి కిరాతకంగా హతమార్చాడు. కడపజిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామాన...

యామాపూర్ మాజీ సర్పంచ్ పై కాల్పులు జరిగిన దుండగులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజన్నపై అర్థరాత్రి దుండగులు కాల్పు...

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది...

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీర...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో గందరగోళం

ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తాం. లేకుంటే ఇవ్వలేం అని వృత్తివిద్యా కళాశాలలు షరతు విధిం...

జీఎస్టీ పరిధిలోకి రానున్న రియల్ ఎస్టేట్

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ త...