ఐపీయల్ లీగ్ దశ చివరికి చేరుకుంది. అయినా ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్లిన జట్టు ముంబై ఇండియన్స్ ఒక్కటే అని చెప్పాలి. 16 పాయింట్లతో కోల్ కతా నైట్ రైడర్స్, రైసింగ్ పుణె సూపర్ జైంట్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్యనే నాలుగో స్థానం కోసం పోటీ అనుకున్న అభిమానులు. నిన్న పుణెతో మ్యాచ్ లో ఢిల్లీ గెలవటంతో ఒక్కసారిగా సమీకరణాలు అన్ని మారిపోయాయి.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గుప్తిల్ ఈ ఈ క్యాచ్ పట్టిన తీరుని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న మార్టిన్ గుప్తిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గుప్తిల్ అది అసాధ్యమని భావించి కేవలం ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతేకాదు ఆపై బౌండరీ లైన్‌ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకున్నాడు. గుప్తిల్ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సీజన్‌లో కొంత మంది స్టార్‌ ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనే అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. లాభదాయకమైన ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్లు ఆడకుండా నిరోధించడంతో పాటు వారిని ఆకర్షించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మల్టీ- ఇయర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ఆటగాళ్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఆస్ట్రేలియా పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. ఈ ప్రతిపాదనను ఆసీస్ క్రికెటర్లు అంగీకరిస్తే వచ్చే ఐపీఎల్‌లో ఆసీస్ క్రికెటర్లు ఎవరూ ఐపీఎల్ లో ఆడరు. 

ప్రపంచ క్రికెట్‌లో ఇన్నాళ్లూ మనదే ఆధిపత్యం బీసీసీఐ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఆదాయ పంపిణితో పాటు ఐసీసీలో సంస్కరణల విషయంలో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటి నుంచి మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో బీసీసీఐకి వ్యతిరేకంగా ఏ దేశ బోర్డు కూడా ఆటగాళ్లను పంపకుండా ఉంటామని ధైర్యంగా చెప్పలేకపోయాయి.

మా దేశంలో మీ పర్యటన లేకుంటే మా క్రికెటర్లు ఐపీఎల్ ఆడబోరని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈవో హరూన్ లోర్గాత్ లేఖ రాయగా తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన ఆటగాళ్ల విషయంలో కఠిన నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఐపీఎల్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చే సీజన్ ఐపీఎల్ నుంచి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో రెండునెలలు దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండడం లేదు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సుదీర్ఘ కాంట్రాక్ట్ రూపంలో ఆటగాళ్ల కాళ్లకు బంధాలేసేలా ప్రణాళికలు రచిస్తుంది. 

ఈ నిబంధనతో ఆసీస్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడినందుకు వచ్చే రాబడి కన్నా మిన్నగా వచ్చేలా కాంట్రాక్ట్ నిబంధన విధించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో ఆటగాళ్లు గాయపడే అవకాశం కూడా ఉండదని సుదీర్ఘంగా ఆడడంతో కీలక పర్యటనలకు ఆసీస్ స్టార్లు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 

ఆసీస్ స్టార్లు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్ , హాజెల్‌వుడ్, ప్యాట్‌కమిన్స్ లాంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని సీఏ ఆలోచన. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని ఆసీస్ క్రికెటర్లు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరహా కాంట్రాక్టులతో క్రికెట్ ఆస్ట్రేలియా పాలకవర్గానికి మాత్రమే లబ్ది చేకూరుతుందని వారు వాపోతున్నారు. ఈ తరహా కాంట్రాక్టులు సమ్మతం కాదంటూ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేశారు.

వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌ కప్పును తిరిగి దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తానని డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తిరిగి వన్డే జట్టులోకి తాను ఎంపికవడం ఆనందం కలిగించిందని అన్నాడు యువీ. ఈ టోర్నీ సవాలుతో కూడుకుంది అని, టోర్నీలో ఆడే ప్రతీజట్టు చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుంది అని, తాము ఉన్న గ్రూప్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది, అయితే వరుసగా రెండోసారి టోర్నీ నెగ్గేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామని యువరాజ్ సింగ్ అన్నాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కష్టాలు రోగులను...

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక టీడీపీ కార్యకర్త మృతి...

జీఎస్టీకి నిరసనగా రోడ్డెక్కిన ఖమ్మంలోని వ్యాపారులు

గ్రానైట్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28శాతం జీఎస్టీకి నిరసనగా ఖమ్మంలో వ్యాపారులు రోడ్డెక్కారు. కేంద్రం...

నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనపరచిన జగిత్యాల జిల్లా విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి అలేఖ్య అనే విద్యార్థిని నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి మ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మ‌రోసారి భారత్ ఫై పాక్ దాడి

భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధ...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...