ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమిటీ చైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్ అన్నారు. 2019లో జరిగే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. కుటుంబసభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. భారత జట్టు  కోచ్ నియామకం విషయం తమ పరిధిలో లేదని త్వరలోనే ఇండియన్ టీంకు కోచ్ నియామకం జరుగుతుందని ప్రసాద్ చెప్పారు.

 

 

 

టీమిండియా కోచ్ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. కెప్టెన్ కోహ్లీతో పాటు, క్రికెటర్లు కూడా కుంబ్లేను వ్యతిరేకిస్తుండడంతో కుంబ్లే ఖేల్ ఖతం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ లతో కూడిన సలహా కమిటి అనిల్ కుంబ్లేవైపు మొగ్గుచూపుతోంది. ఈ ముగ్గురు కూడా కోచ్ గా కుంబ్లేను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి బీసీసీఐ కూడా ఆమోదముద్ర వేసే అవకాశముండడంతో కోహ్లీకి చెక్ పడినట్టే అని భావిస్తున్నారు.  

 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ముంబైలో సందడి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రెట్ లీ సరదాగా గడుపుతూ చిన్నారుల్లో ఆనందాన్ని నింపే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ థెరపీ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన సొంత స్వచ్ఛంద సంస్థ మ్యూజిక్ ఇండియా ఫౌండేషన్ ద్వారా తరచూ బ్రెట్ లీ ప్రత్యేక కార్యక్రమాలు చారీటీకోసం నిర్వహిస్తూ ఉంటారు.

 

కొన్నాళ్ల క్రితం వరకు సాంప్రదాయ టెస్టులు మినహా వన్డేల్లో ఈ టీమ్‌ అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే గత రెండేళ్లలో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతో ప్రపంచంలో ఏ వేదికలోనైనా వన్డేల్లో భారీ స్కోర్లు సాధిస్తున్న ఇంగ్లండ్‌ బలమైన జట్టుగా ఎదిగింది. తమ వన్డే చరిత్రలో అత్యుత్తమ దశలో ఉన్న ఇంగ్లండ్‌ సొంతగడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీలో ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇంగ్లండ్‌లోనే జరిగిన రెండు చాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ ఫైనల్లో ఓడిన ఆ జట్టు ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది.

ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు తాజా ఫామ్‌ ఏ ప్రత్యర్థికైనా దడ పుట్టించేలా ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన ప్రత్యర్థితో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సాధించిన అలవోక విజయం దానిని మళ్లీ నిరూపించింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యం గల ఆటగాళ్లతో పాటు సొంతగడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుండటం ఆ జట్టుకు అదనంగా అనుకూలించే అంశం. ముఖ్యంగా మోర్గాన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వన్డే టీమ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఏకంగా తొమ్మిదో స్థానం వరకు ఎలాంటి తత్తరపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగల లైనప్‌ ఇంగ్లండ్‌ సొంతం. తమకు అనుకూలించే వాతావరణ పరిస్థితుల్లో స్వింగ్‌తో చెలరేగిపోగల బౌలర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ఇవన్నీ ఇతర జట్లకంటే ఆతిథ్య జట్టును అందరికంటే ముందు నిలబెడుతున్నాయి.

చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ రెండు సార్లు ఫైనల్‌ చేరింది. 2004లో వెస్టిండీస్‌ చేతిలో ఆ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 217 పరుగులు చేసిన ఇంగ్లండ్‌.. విండీస్‌ను 147/8 వద్ద కట్టడి చేసి విజయాన్ని ఆశించింది. కానీ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రౌన్, బ్రాడ్‌షా 71 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ కథ ముగించారు. గత టోర్నీలో భారత్‌ చేతిలోనే ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చేతిలో ఆరు వికెట్లతో 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్‌ ఓటమి దిశగా నడిచింది. ఓవరాల్‌గా చాంపియన్స్‌ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ టీమ్‌ 11 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓడింది.

ఓపెనర్లు జేసన్‌ రాయ్, హేల్స్‌ జోడి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తోంది. ప్రతీసారి వీరు అందిస్తున్న శుభారంభమే ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేస్తోంది. నిలకడకు మారు పేరైన జో రూట్‌తో పాటు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్, బెన్‌ స్టోక్స్‌లతో జట్టు మిడిలార్డర్‌ కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ఇంగ్లండ్‌ జట్టుకు వరంలా మారింది. ప్రపంచంలోనే ఇప్పుడు మేటి ఆల్‌రౌండర్‌గా ఉన్న స్టోక్స్, ఇటీవల ఐపీఎల్‌లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్లకు కష్టాలు తప్పవు. మోకాలి గాయం నుంచి కోలుకొని అతను పూర్తి ఫిట్‌గా మారడం ఆ జట్టు ఆందోళనను దూరం చేసింది. మొయిన్‌ అలీ కూడా ఆల్‌రౌండర్‌గా చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై వోక్స్, వుడ్, ప్లంకెట్‌లాంటి పేసర్లు సరిగ్గా సరిపోతారు.

లీగ్‌ దశలో జూన్‌ 1న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడాల్సి ఉన్నా ఇంగ్లండ్‌ గడ్డపై ఇటీవల ఆస్ట్రేలియాకు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి మోర్గాన్‌ సేన సెమీస్‌ అడుగు ఖాయంగా వేసినట్లే. ఇంగ్లండును సొంతగడ్డపై ఎదుర్కోవడం కష్టమే అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా ఇంగ్లండుకే ఉందని  వెస్టిండీస్ లెజెండ్రీ క్రికెటర్ బ్రియాన్ లారా విశ్లేషించాడు. 

కాంగ్రెస్ లోకి రేవంత్ చేరికపై మీడియాలో పుకార్లు

కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తు...

సీపీయం పార్టీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు

సీపీయం పార్టీపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేరళలో హత్యా రాజకీయాలను సీఎం విజయన్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ పార...

ఏపీలో 36 వేల కోట్లతో ఏరోసిటీ

ఆంధ్రప్రదేశ్ లో 36 వేలకోట్ల రూపాయలతో ఏరోసిటీ నిర్మించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల...

విశాఖలో భక్తులతో పోట్టెత్తిన శివలయాలు

విశాఖలో కార్తిక శోభతో శివలయాలు భక్తులతో పోట్టెతాయి. కార్తికమాసంలో మొదటి సోమవారం కావడం నాగులచవితి కూడా ఈ పరవదిన...

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల బైపాస్ హైవేపై అగ్నిప్రమాదం జరిగింది. ఇచ్చోడ మండలం నుండి ఆదిలాబాద్...

సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై కేసు నమోదైంది. తన ఇంట్లో గంజాయిని ఉంచి తనను గంజాయి కేసులో ఇర...

సింగపూర్‌లో అమరావతికి భూములిచ్చిన రైతుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలౌతున్న వివిధ అభివృద్ధి పథకాలను...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

హైకోర్టు విభజన ప్రక్రియ షురూ

హైకోర్టు విభజనకు రంగం సిద్ధమైంది. తమకు ఏ రాష్ట్రం కావాలో తెలపాల్సిందిగా ఉమ్మడి హైకోర్టులోని జడ్జీలకు ఆప్షన్ అడ...

కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం

కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలపై ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్...

తాగిన మైకంలో కుటుంబసభ్యులను హతమార్చిన కసాయి

ఓ కిరాతకుడు తాగిన మైకంలో కుటుంబసభ్యులను అతి కిరాతకంగా హతమార్చాడు. కడపజిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామాన...

యామాపూర్ మాజీ సర్పంచ్ పై కాల్పులు జరిగిన దుండగులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజన్నపై అర్థరాత్రి దుండగులు కాల్పు...

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది...

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీర...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో గందరగోళం

ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తాం. లేకుంటే ఇవ్వలేం అని వృత్తివిద్యా కళాశాలలు షరతు విధిం...

జీఎస్టీ పరిధిలోకి రానున్న రియల్ ఎస్టేట్

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ త...