బెంగళూరు: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, ఏపీ సీఎం జగన్ బాటలో నడుస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ఆందోళనకు
సిద్దమవుతున్నాడు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కానీ లోకల్ నిరుద్యోగులకు మొండి చెయ్యే ఎదురవుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ డిమాండ్ పై ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఉపేంద్ర స్పష్టం చేశారు.