బెంగళూరు: కర్ణాటకలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ రోజు పర్యటించనున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న
బెళగావి జిల్లాలో ఆయన ఏరియల్ సర్వే జరుపనున్నారు. పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బెళగావి చేరుకుని జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపడతారు. ఏరియల్ సర్వేలో అమిత్ షాతో పాటు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కూడా ఉంటారు. అనంతరం వరద బాధితులకు అందిస్తున్న సహాయం, పునరావాస చర్యలపై సీనియర్ అధికారులతో అమిత్షా చర్చలు జరుపుతారు.