ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన తాత్కాలిక అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ సోనియాగాంధీని ఎంపిక చేసింది. కాగా... సోనియాగాంధీ దాదాపు 20 నెలల తర్వాత తిరిగి పార్టీ పగ్గాలను
అందుకోనున్నారు. ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాను మించిన నాయకత్వం కనిపించడంలేదని అందుకే ఆమెను తాత్కాలికంగా అధ్యక్ష పదవికి ఎన్నుకున్నట్లు వెల్లడించారు.