సోలన్: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఘోర జరిగింది. ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 13 మంది జవాన్లు కాగా, ఒకరు పౌరుడు కలిపి మొత్తం 14 మంది మృత్యువాత
పడ్డారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కుమార్హట్టి ప్రాంతంలో నేలకుంగి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల్లో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.