బెంగళూరు: విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల డిమాండ్లు
పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉంది. వాళ్లంతా ఎన్నోఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని చట్టంలో స్పష్టంగా ఉంది. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో సమస్యలపై పులుల్లా పోరాడారు. ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు వారంతా సహకరిస్తారని, ప్రభుత్వాన్ని కాపాడుతారనే సంకేతాలు మాకు అందుతున్నాయని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.