Print
Hits: 109

ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలో రుతుపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారుల మాటలకే పరిమితం..ముందు

ఒక ప్రకటన చేసి, తర్వాత మళ్లీ రుతుపవనాలు ఆలస్యమవుతాయని చెప్తూనే ఉంటారు. ఈసారి జూన్ మొదటి వారంలోనే రాష్ర్టాన్ని రుతుపవనాలు తాకుతాయని ప్రకటించి రెండ్రోజులైనా కాలేదు. అప్పుడే రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని ప్రకటించింది ఐఎండీ. ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నాటికి దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 6వ తేదీన కేరళలోకి ప్రవేశించనున్నాయట. అంటే తెలుగు రాష్ర్టాలను తాకే సరికి మరింత సమయం పడుతుందనమాట. అప్పటి వరకూ ఈ భానుడి భగభగలు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులలు. అంతేకాక..ఈ ఏడాది వర్షపాతం కూడా సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. అలాగే పసిఫిక్‌ సముద్రంపై వేడిగాలుల కారణంగా ఈసారి ‘‘ఎల్‌నినో’’ వచ్చే అవకాశం 55శాతం ఉందని తెలిపింది. వాయువ్య, దక్షిణ భారతదేశ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, ఈశాన్య, మధ్యభారతాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని స్కైమెట్  పేర్కొంది.

e-max.it: your social media marketing partner